ఓటింగ్ ముగిసింది.. ఫలితమే తరువాయి
అత్యంత ఉత్కంఠభరితంగా, నాటకీయ పరిణామాల మధ్య కొనసాగిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ముగిసింది. సభలో 119 మంది ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేతో కలిపి మొత్తం 120 మంది ఉండగా.. వారిలో ఇద్దరు వామపక్ష సభ్కయులు తమ ఓటుహక్కును వినియోగించుకోలేదు. మిగిలిన 118 మంది మధ్యాహ్నం 3 గంటల లోపే ఓట్లు వేసేశారు.
సాయంత్రం 4 గంటలతో పోలింగ్ సమయం ముగుస్తుంది. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, ఎంఐఎం తదితర పార్టీల సభ్యులంతా తమ తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. సీపీఎం, సీపీఐ సభ్యులు మాత్రం ఓటింగుకు దూరంగా ఉన్నారు. ప్రస్తుత బలాబలాలను బట్టి చూస్తే.. ఐదుగురు టీఆర్ఎస్ అభ్యర్థులు, ఒక కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నట్లు నాయకులు చెబుతున్నారు. ఆరు స్థానాలు ఖాళీ ఉండగా, మొత్తం ఏడుగురు అభ్యర్థులు పోటీలో నిలవడంతో ఇక్కడ ఎన్నిక అనివార్యం అయ్యింది.