రెండు రాష్ట్రాలు ఎందుకు ఉండకూడదు? | chidambaram speech at telangana PCC meeting | Sakshi
Sakshi News home page

రెండు రాష్ట్రాలు ఎందుకు ఉండకూడదు?

Published Sun, Jan 29 2017 1:51 PM | Last Updated on Sat, Aug 11 2018 7:41 PM

రెండు రాష్ట్రాలు ఎందుకు ఉండకూడదు? - Sakshi

రెండు రాష్ట్రాలు ఎందుకు ఉండకూడదు?

హైదరాబాద్: పాత పెద్ద నోట్ల రద్దు అతి పెద్ద కుంభకోణం అని కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం ఆరోపించారు. నోట్ల రద్దు తర్వాత ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని తెలిపారు. తెలంగాణ పీసీసీ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణ సెంటిమెంట్ ను గౌరవించి తమ పార్టీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందని గుర్తు చేశారు. తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు ఎందుకు ఉండకూడదని ఆయన ప్రశ్నించారు. చిన్నరాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందుతాయన్నారు. గుజరాత్,  పంజాబ్, హర్యానా ఇందుకు నిదర్శనమని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీలను ఎందుకు నెరవేర్చడం లేదని ఆయన ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement