వ్యవసాయానికి 8 గంటలపాటు విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సోమవారం మహబూబ్ నగర్ లో ధర్నాకు దిగారు.
మహబూబ్నగర్: వ్యవసాయానికి 8 గంటలపాటు విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సోమవారం మహబూబ్ నగర్ లో ధర్నాకు దిగారు. విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, డి. శ్రీనివాస్, గీతారెడ్డి, డీకే అరుణ ఇతర ముఖ్యనేతలు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నదాతలకు సరిపడా విద్యుత్ ఇవ్వడంలో విఫలమైందంటూ... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.
ధర్నా తర్వాత రోడ్డు బైఠాయించారు. దీంతో డీకే అరుణ సహా ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి, వంశీచంద్ రెడ్డి, సంపత్, రామ్మోహన్ రెడ్డి సహా పలువురి పోలీసులు అరెస్ట్ చేశారు.