'మైనార్టీలకు రిజర్వేషన్ల హామీ ఏమైంది' | telangana pcc chief uttam quetions to kcr government over minority reservations | Sakshi
Sakshi News home page

'మైనార్టీలకు రిజర్వేషన్ల హామీ ఏమైంది'

Published Fri, Jan 1 2016 6:00 PM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

'మైనార్టీలకు రిజర్వేషన్ల హామీ ఏమైంది' - Sakshi

'మైనార్టీలకు రిజర్వేషన్ల హామీ ఏమైంది'

హైదరాబాద్: మైనార్టీలకు ఎన్నికల్లో ఇచ్చిన 12 శాతం రిజర్వేషన్ల హామీ ఏమైందని తెలంగాణ ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్ రావును టీ-పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. దీనిపై ఎంఐఎం ఎందుకు మాట్లాడటం లేదో సమాధానం చెప్పాలన్నారు. హైదరబాద్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను నిష్పాక్షపాతంగా నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాలుగైదు రోజుల్లోనే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటిస్తామని ఉత్తమ్ తెలిపారు. భావ సారూప్యత ఉన్న పార్టీలతో ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటామని చెప్పారు. సెటిలర్ల ప్రభావం ఎక్కువగా ఉన్న చోట్ల వారికే టిక్కెట్లు కేటాయిస్తామని ఆయన చెప్పారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement