minority reservations
-
గాంధీ కావాలా?.. మోదీ కావాలా?
-
TG: అసెంబ్లీలో వైఎస్ఆర్ను పొగిడిన అక్బరుద్దీన్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ పొగిడారు. బడ్జెట్లో సోమవారం(జులై 29) బడ్జెట్‌పై మాట్లాడిన సందర్భంగా ఒవైసీ వైఎస్ఆర్ను గుర్తుచేసుకున్నారు. ముస్లింలకు రిజర్వేషన్ విషయంలో వైఎస్ఆర్ న్యాయం చేశారని కొనియాడారు.ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చి మైనార్టీల మదిలో వైఎస్ఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు. వైఎస్ఆర్ లేకపోతే రిజర్వేషన్ల అంశంలో తమకు అన్యాయం జరిగేదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ మైనారిటీ విద్యార్థుల స్కాలర్షిప్ విషయంలో సాయం చేశారని గుర్తుచేశారు. ఎవరు న్యాయం చేసినా వాళ్ల గురించి మొహమాటం లేకుండా చెప్తానన్నారు. -
4% రిజర్వేషన్ రద్దు చేసే ప్రసక్తే లేదు!!
-
ముస్లింలకు బాబు టోపీ
-
ముస్లిం రిజర్వేషన్లపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
-
ఎవరి ‘కోటా’ తగ్గిస్తారు?
కాగజ్‌నగర్/హన్మకొండ/త్రిపురారం: ప్రస్తుతం కొనసాగుతున్న రిజర్వేషన్లలో ఎవరి కోటా తగ్గించి ముస్లింలకు 12 శాతం కల్పిస్తారని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలం నజ్రుల్‌నగర్‌లో, వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో, నల్లగొండ జిల్లా హాలియాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. రిజర్వేషన్ కల్పించడం చేతకాక కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిందలు మోపుతున్నారని మండిపడ్డారు. మైనార్టీలకు రిజర్వేషన్లు ఎక్కడి నుంచి ఇస్తారని, ఎవరి రిజర్వేషన్లకు కోత పెడతారని ప్రశ్నించారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఓట్ల కోసం మతాలు, కులాల వారీగా ప్రజలను విభజిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూడటం దుర్మార్గమన్నారు. బెంగాలీలకు కుల ప్రాతిపదికపై అన్యాయం జరుగుతోందని, అక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అర్హులను ఎస్సీ కేటగిరిలో చేరుస్తామన్నారు. టీడీపీ మూల్యం చెల్లించుకోక తప్పదు కాంగ్రెస్, టీడీపీ కలసి పోటీ చేస్తుండటంతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ఈ పొత్తు అనైతికమని, దీనికి టీడీపీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రైతులకు రుణమాఫీ, రైతులకు సంక్షేమ పథకాలు అమలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో 4,500 మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రశ్నించారు. రైతాంగానికి గతంలో ఎన్నడూ లేని విధంగా కనీస మద్దతు ధరను మోదీ ప్రభుత్వం అందిస్తుందన్నారు. వరంగల్‌లో టెక్స్టైల్ పార్కు కోసం రూ. 100 కోట్లు, కాకతీయ మెడికల్ కళాశాలలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కోసం రూ.155 కోట్లు మంజూరు చేస్తే నేటి వరకూ పనులు ప్రారంభం కాకుండానే శంకుస్థాపనకు పరిమితమయ్యాయని తెలిపారు. ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయికి దేశం నాలుగున్నరేళ్ల బీజేపీ పాలనలో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతూ ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయికి చేరిందని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 13వ ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి రూ.16 వేల కోట్లు కేటాయిస్తే, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక 14వ ఆర్థిక సంఘం ద్వారా రూ.1.15 లక్షల కోట్లు రాష్ట్రానికి మంజూరు చేసినా అభివృద్ధి కనిపించడం లేదని విమర్శించారు. దేశంలో నక్సల్స్ సమస్య తగ్గిందన్నారు. ఉగ్రవాదులను దేశపొలిమెరలోకి రాకుండా కట్టడి చేశామన్నారు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పొత్తు పెట్టుకున్నాయని విని ఆశ్చర్యపోయానని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. ‘వాదేహై వాదోంకా క్యా’ అనే పాట గుర్తుకొస్తుంది ముఖ్యమంత్రి కేసీఆర్ వాగ్దానాలు చూస్తుంటే పాత రోజుల్లో ఉపకార్ సినిమాలోని ‘వాదేహై వాదోంకా క్యా’అనే పాట గుర్తుకొస్తుందని రాజ్‌నాథ్ సింగ్ ఎద్దేవా చేశారు. ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా వాగ్దాన భంగం చేసిన కేసీఆర్.. మళ్లీ మోసం చేయడానికి మీ ముందుకు వస్తున్నారన్నారు. 2022 నాటికి దేశంలో సొంతిళ్లు లేని వారు ఉండకూడదన్నదే బీజేపీ లక్ష్యమన్నారు. మోదీ నాయకత్వంలో ప్రపంచంలో భారతదేశం శక్తివంత దేశంగా ఎదిగితే, రాహుల్‌గాంధీ ఆలుగడ్డల పరిశ్రమ ఏర్పాటు చేస్తామని అంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీకి, రాహుల్‌కు ఉన్న విజన్‌లో తేడా ఇదేనని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం రూ లక్షా15 వేల కోట్లు ఇచ్చిందని కేంద్రమంత్రి తెలిపారు. -
రాష్ట్ర వ్యాప్తంగా సీఎం దిష్టిబొమ్మల దహనం
హైదరాబాద్: మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించ తలపెట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. బీజేపీ శ్రేణులు నిరసనలు ఉద్రితం చేశాయి. నిన్న చేపట్ట తలపెట్టిన అసెంబ్లీ ముట్టడిని పోలీసులు ఉక్కుపాదంతో అణిచివేయడంతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టి బొమ్మలను దహనం చేశారు. హన్మకొండ, కరీంనగర్, సిరిసిల్లలతో పాటు నగరంలోని మాదన్నపేటలో ధర్నాలు నిర్వహిస్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. minority reservations, bjp protest,, -
వైఎస్ జగన్‌ను కలిసిన ముస్లిం మతపెద్దలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జమాత్ ఇ ఉలేమా ఏ హింద్ ప్రతినిధుల బృందం గురువారం కలిసింది. లోటస్ పాండ్‌లోని వైఎస్ జగన్ నివాసంలో ఆయనను కలిసిన ముస్లిం మత పెద్దలు... మైనార్టీ రిజర్వేషన్లపై ఈ నెల 18న సుప్రీంలో విచారణకు రానున్న నేపథ్యంలో మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజాద్ బాషా మాట్లాడుతూ...ముస్లింల రిజర్వేషన్లకు వైఎస్సార్ సీపీ మద్దతిస్తుందన్నారు. దీనిపై వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. -
'మైనార్టీలకు రిజర్వేషన్ల హామీ ఏమైంది'
హైదరాబాద్: మైనార్టీలకు ఎన్నికల్లో ఇచ్చిన 12 శాతం రిజర్వేషన్ల హామీ ఏమైందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును టీ-పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. దీనిపై ఎంఐఎం ఎందుకు మాట్లాడటం లేదో సమాధానం చెప్పాలన్నారు. హైదరబాద్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను నిష్పాక్షపాతంగా నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాలుగైదు రోజుల్లోనే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటిస్తామని ఉత్తమ్ తెలిపారు. భావ సారూప్యత ఉన్న పార్టీలతో ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటామని చెప్పారు. సెటిలర్ల ప్రభావం ఎక్కువగా ఉన్న చోట్ల వారికే టిక్కెట్లు కేటాయిస్తామని ఆయన చెప్పారు. -
'రిజర్వేషన్ హామీపై వెనక్కు తగ్గడం సరికాదు'
హైదరాబాద్: మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్న తెలంగాణ ప్రభుత్వం తన తాజా బడ్జెట్ లో ఒక శాతం తగ్గించడాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే షబ్బీర్ అలీ తప్పుబట్టారు. తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ లో మైనార్టీలకు 11 శాతం రిజర్వేషన్ మాత్రమే ప్రవేశపెట్టడాన్నిఆయన ప్రశ్నించారు. తొలుత ఇచ్చిన హామీపై ప్రభుత్వం వెనక్కు తగ్గడం సరికాదన్నారు. ఈ నెల 23 న టీపీసీసీ మైనార్టీ సెల్ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు షబ్బీర్ తెలిపారు. ఆ సమావేశంలో పాల్గొనడానికి రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ కు వస్తున్నారన్నారు. ఆ సమావేశంలో ఎంఐఎంను ఎదుర్కొనడానికి అనుసరించాల్సిన వ్యూహాన్నిఖరారు చేసుకుంటామన్నారు. ఈ నెల 11 న మౌలానా ఆజాద్ జయంతిని మైనార్టీ సంక్షేమ దినంగా నిర్వహిస్తున్నామని, ఆ అనవాయితీని టీఆర్ఎస్ సర్కారు కూడా కొనసాగించాలన్నారు. -
'మైనారిటీల రిజర్వేషన్లకు మా పార్టీ వ్యతిరేకం'
హైదరాబాద్: రాజ్యాంగ విరుద్దమైన మైనారిటీల రిజర్వేషన్లకు తమ పార్టీ వ్యతిరేకమని సికింద్రాబాద్ ఎంపీ, బీజేపీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ స్సష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ... కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని టీఆర్ఎస్ ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు 'ఉచిత విద్య'ను అమలు చేయలేదని ఆయన ఆరోపించారు. ఆ పథకం అందరికి వర్తిస్తుందో లేదా వెల్లడించాలని ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే 371 డీ నిబంధన, ముల్కి స్థానికత ఉన్నాయి. అలాంటప్పుడు 1956 స్థానికత ఎలా సాధ్యమంటూ ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలు అరికట్టడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అఖిలపక్షాన్ని వెంటనే ఢిల్లీకి తీసుకువెళ్లాలని బండారు దత్తాత్రేయ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.