minority reservations, bjp protest,,
రాష్ట్ర వ్యాప్తంగా సీఎం దిష్టిబొమ్మల దహనం
Published Sat, Mar 25 2017 2:12 PM | Last Updated on Fri, Mar 29 2019 6:00 PM
హైదరాబాద్: మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించ తలపెట్టిన టీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. బీజేపీ శ్రేణులు నిరసనలు ఉద్రితం చేశాయి. నిన్న చేపట్ట తలపెట్టిన అసెంబ్లీ ముట్టడిని పోలీసులు ఉక్కుపాదంతో అణిచివేయడంతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టి బొమ్మలను దహనం చేశారు. హన్మకొండ, కరీంనగర్, సిరిసిల్లలతో పాటు నగరంలోని మాదన్నపేటలో ధర్నాలు నిర్వహిస్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Advertisement
Advertisement