వైఎస్ జగన్ను కలిసిన ముస్లిం మతపెద్దలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జమాత్ ఇ ఉలేమా ఏ హింద్ ప్రతినిధుల బృందం గురువారం కలిసింది.
లోటస్ పాండ్లోని వైఎస్ జగన్ నివాసంలో ఆయనను కలిసిన ముస్లిం మత పెద్దలు... మైనార్టీ రిజర్వేషన్లపై ఈ నెల 18న సుప్రీంలో విచారణకు రానున్న నేపథ్యంలో మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజాద్ బాషా మాట్లాడుతూ...ముస్లింల రిజర్వేషన్లకు వైఎస్సార్ సీపీ మద్దతిస్తుందన్నారు. దీనిపై వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారని చెప్పారు.