
'రిజర్వేషన్ హామీపై వెనక్కు తగ్గడం సరికాదు'
మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్న తెలంగాణ ప్రభుత్వం తన తాజా బడ్జెట్ లో ఒక శాతం తగ్గించడాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే షబ్బీర్ అలీ తప్పుబట్టారు.
హైదరాబాద్: మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్న తెలంగాణ ప్రభుత్వం తన తాజా బడ్జెట్ లో ఒక శాతం తగ్గించడాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే షబ్బీర్ అలీ తప్పుబట్టారు. తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ లో మైనార్టీలకు 11 శాతం రిజర్వేషన్ మాత్రమే ప్రవేశపెట్టడాన్నిఆయన ప్రశ్నించారు. తొలుత ఇచ్చిన హామీపై ప్రభుత్వం వెనక్కు తగ్గడం సరికాదన్నారు. ఈ నెల 23 న టీపీసీసీ మైనార్టీ సెల్ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు షబ్బీర్ తెలిపారు. ఆ సమావేశంలో పాల్గొనడానికి రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ కు వస్తున్నారన్నారు. ఆ సమావేశంలో ఎంఐఎంను ఎదుర్కొనడానికి అనుసరించాల్సిన వ్యూహాన్నిఖరారు చేసుకుంటామన్నారు.
ఈ నెల 11 న మౌలానా ఆజాద్ జయంతిని మైనార్టీ సంక్షేమ దినంగా నిర్వహిస్తున్నామని, ఆ అనవాయితీని టీఆర్ఎస్ సర్కారు కూడా కొనసాగించాలన్నారు.