కాంగ్రెస్ నేతలు చెప్పేవన్నీ కాకి లెక్కలే! | R Vidyasagar Rao criticises tcongress leaders | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ నేతలు చెప్పేవన్నీ కాకి లెక్కలే!

Published Thu, Aug 18 2016 4:52 PM | Last Updated on Sat, Aug 11 2018 7:11 PM

R Vidyasagar Rao criticises tcongress leaders

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్పిన కాకి లెక్కలనే కాంగ్రెస్ నేతలు మళ్లీ చెబుతున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్ రావు విమర్శించారు. తెలంగాణలో ప్రాజెక్టులు, నీటి వినియోగంపై టీ.కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారంపై స్పందించారు. ఈ మేరకు విద్యాసాగర్ రావు మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో 47 లక్షల ఎకరాలకు ఎన్నడూ నీరందలేదని పేర్కొన్నారు. ప్రాజెక్టుల కింద ప్రతిపాదించింది ఎంత.. నీరందించింది ఎంత? అని కాంగ్రెస్ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ లెక్కలు ప్రజల్ని మరింత గందరగోళానికి గురిచేస్తున్నాయని విద్యాసాగర్రావు ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement