
ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ నేతల కన్నెర్ర
నల్లగొండ తెలంగాణ కాంగ్రెస్ నేతల అరెస్టును నిరసిస్తూ.. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పీసీసీ ఇచ్చిన పిలుపుమేరకు జిల్లా కాంగ్రెస్ నాయకులు,
నల్లగొండ తెలంగాణ కాంగ్రెస్ నేతల అరెస్టును నిరసిస్తూ.. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పీసీసీ ఇచ్చిన పిలుపుమేరకు జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఆందోళన బాటపట్టారు. మండల, నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా, రాస్తారోకోలు నిర్వహించారు. చౌటుప్పుల్, నకిరేకల్‌లో జాతీయ రహదారి మీద ధర్నా నిర్వహించారు. మోత్కూరులో నిర్వహించిన రాస్తారోకోలో డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్, మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్‌చౌక్ వద్ద కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు రాస్తారోకో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎన్.భాస్కర్‌రావు, మున్సిపల్ చైర్‌పర్సన్ తిరునగరు నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కేతేపల్లి, రామన్నపేట, చిట్యాలలో మండల కాంగ్రెస్ నాయకులు నిరసన ర్యాలీలు, రాస్తారోకో చేశారు. హుజూర్‌నగర్‌లో రాస్తారోకో నిర్వహించారు. గరిడేపల్లి, భువనగిరి రాస్తారోకో నిర్వహించారు. మండలంలోని అనాజిపురం, బీబీనగర్‌లో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. వలిగొండ, పోచంపల్లి, ఆలేరు, రాజాపేట, యాదగిరిగుట్ట, గుండాల, ఆత్మకూరు, తుర్కపల్లి, త్రిపురారం, హాలియా, పెద్దవూర మండలాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. పలుచోట్ల సీఎం కేసీఆర్, వుంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
సచివాలయూన్ని తరలిస్తే ఉద్యవుమే :డీసీసీ అధ్యక్షుడు భిక్షమయ్యగౌడ్
మోత్కూరు : సచివాలయం, ఛాతి ఆస్పత్రి తరలిస్తే మిలియున్ వూర్చ్ తరహా ఉద్యవూన్ని చేపడతావుని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షవుయ్యుగౌడ్ అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై పోలీసుల దాడికి నిరసిస్తూ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆదివారం మోత్కూరు మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా భిక్షవుయ్యుగౌడ్, వూజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హాజరయ్యూరు. కేసీఆర్ దిష్టిబొమ్మను భిక్షమయ్య స్వయంగా దహనం చేశారు.
ధర్నాను ఉద్దేశించి భిక్షమయ్యగౌడ్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం రాజయ్యను ఏకపక్షంగా బర్తరఫ్ చేయడం సీఎం కేసీఆర్ దొరతనానికి నిదర్శనం అన్నారు. మాజీ ఎంపీ రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ సోనియాగాంధీ పుణ్యమే కేసీఆర్ సీఎం అయ్యారని.. సీఎం అయ్యూక అహంభావంగా వ్యవహరిస్తున్న కేసీఆర్ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు పైళ్ల సోమిరెడ్డి, జెడ్పీటీసీ చింతల వరలక్ష్మి, మార్కెట్ కమిటి మాజీచైర్మన్ వి.పూర్ణచందర్‌రావు, బ్లాక్ మహిళాకాంగ్రెస్ అధ్యక్షురాలు బండ స్వరూప, జిల్లా మైనార్టీసెల్ అధ్యక్షుడు జి.జోసఫ్, జిల్లా పార్టీ కార్యదర్శులు పాశం విష్ణువర్దన్‌రావు, కల్యాణ్‌చక్రవర్తి, నాయకులు కె.వెంకటేశ్వర్లు, చిం తల విజయభాస్కర్‌రెడ్డి, యాకయ్య, జనార్దన్‌రెడ్డి, నభీ, సమీర్, శంకర్‌రెడ్డి, నర్సింహ, వినోద, వీరలక్ష్మి, నర్సిరెడ్డి, నర్సయ్య, భిక్షపతి, భీష్మారెడ్డి, వేణు, ఎల్లయ్య, శ్రీరాములు, జిట్ట నరేష్ ఉన్నారు.