'పదవి కట్టబెట్టారు.. ధన్యవాదాలు' | uttam kumar reddy thanks congress highcommand for pcc chief post | Sakshi
Sakshi News home page

'పదవి కట్టబెట్టారు.. ధన్యవాదాలు'

Published Mon, Mar 2 2015 1:55 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

'పదవి కట్టబెట్టారు.. ధన్యవాదాలు' - Sakshi

'పదవి కట్టబెట్టారు.. ధన్యవాదాలు'

పీసీసీ అధ్యక్ష బాధ్యతలు తనకు ఇచ్చినందుకు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలిపారు. ఆచరణ సాధ్యం కాని ఆకర్షణీయ హామీలు ఇవ్వడం వల్లే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిందని, ఆ హామీల అమలుకు టీఆర్ఎస్ సర్కారుపై ఒత్తిడి పెంచుతామని ఉత్తమ్ చెప్పారు.

ఒకే జిల్లా, ఒకే సామాజికవర్గానికి కీలక పదవులు ఇస్తున్నారన్న అసంతృప్తి ఏదీ పార్టీలో లేదని, పార్టీలో సామాజిక న్యాయాన్ని హైకమాండ్ అమలుచేస్తుందని ఆయన చెప్పారు. సీనియర్లందరినీ కలుపుకొని వెళ్లి అధికార టీఆర్ఎస్పై పోరాడుతామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement