pcc chief uttam kumar reddy
-
కేసీఆర్ ఏ రాష్ట్రంలో సర్వే చేశాడో? : ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ రాష్ట్ర ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను పట్టించుకోవడం లేదని పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పెండింగ్‌లో ఉన్న పీఆర్సీని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నాలుగేళ్లుగా కనీసం వారికి అనుమతి కూడా ఇవ్వలేదని అన్నారు. మొన్న మే నెలలో ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలను జూన్‌లో ఐఆర్, ఆగస్టులో పీఆర్సీని ఇస్తామని ఇంత వరకు అమలు చేయలేదన్నారు. ఆర్టీసీ కార్మికులకు 16 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ఇస్తామనడం న్యాయామా అని ప్రశ్నించారు. హాస్పిటల్స్ బిల్లులు పెండింగ్‌లో ఉండటం వల్ల ఉద్యోగుల ఆరోగ్య కార్డులు చెల్లుబాటు కావడం లేదన్నారు. ఉద్యోగులకు పది రోజులు కర్మకాండల సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసేలా ఒప్పకోవాలని అన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసే అధికారం రాష్ట్రానిదేనని, ఐఆర్‌టీలో ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసిందని అన్నారు. ఇది తెలంగాణ పబ్లిక్ సర్వీస్‌లో స్పష్టంగా ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మాత్రం ఏ రాష్ట్రం సర్వే చేసాడో తమకు తెలియడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. -
మహిళా సాధికారతను పట్టించుకోని ప్రభుత్వం..
హుజూర్నగర్ : మహిళా సాధికారతను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగâవారం హుజూర్నగర్ మండలం అమరవరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహిళల ఆర్థిక ప్రగతి, చైతన్యం కోసం గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంతగానో పాటుపడ్డాయన్నారు. ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి చేయూతనందించకుండా, రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా ప్రాతినిద్యం కల్పించలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మంది సమభావన సంఘాల మహిళలకు పావలా వడ్డీ కింద ప్రభుత్వం రూ.రెండు వేల కోట్లు చెల్లించాల్సి ఉండగా నేటికీ బ కాయిలు గానే మిగిలిపోయాయన్నారు. ప్రభుత్వం వెంటనే పావలా వడ్డీ బకాయిలను చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం చెల్లించకపోతే.. 20 19లో రానున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే బకాయిలన్నీంటినీ విడుదల చేస్తుం దన్నారు. ప్రతి సంఘానికి రూ.10లక్షలు రుణంగా అందజేసి వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. అన్ని సంఘాలకు రూ.లక్ష గ్రాంట్‌గా అందజేస్తామన్నారు. అభయహస్తం పింఛన్లను పునరుద్ధరించి ఆసరా పింఛన్లతో సంబంధం లేకుండా ప్రతినెలా రూ.1000 అందజేస్తామన్నారు. సమభావన సంఘాల సభ్యులకు ప్రస్తుతం ఉన్న బీమాను మరింతగా పెంచి సాధారణ మరణానికి రూ.2,50,000, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు అందజేస్తామన్నారు. తమ ప్రభుత్వం మహిళల సర్వతోముఖాభివృద్ధికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. -
'ఇజ్రాయెల్ సైన్యంతో పోల్చడం సరికాదు'
హైదరాబాద్ : భారత సైన్యాన్ని ఇజ్రాయెల్ సైన్యంతో పోల్చడం సరికాదని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ....రాజ్యాంగాన్ని కాపాడాల్సిన పెద్ద మనుషులే ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 47 మంది ప్రజాప్రతినిధులను సీఎం కేసీఆర్ కొనుగోలు చేసి టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రజలను మతల పరంగా చీల్చడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. అందుకే అయోధ్య వివాదాన్ని మరోసారి తెరపైకి తెచ్చిందని ఉత్తమ్ మండిపడ్డారు. -
‘ప్రాణహిత’ డిజైన్ మారిస్తే ఊర్కోం!
♦ అది అంబేద్కర్ పేరిట పెట్టిన తెలంగాణ కలల ప్రాజెక్టు ♦ పీసీసీ చీఫ్ ఉత్తమ్, జానా, భట్టి సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కాంగ్రెస్ హయాంలో మేధావులైన ఇంజనీర్లతో డిజైన్ చేయించి.. సాంకేతిక లోపాలు లేకుండా రూపొందించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ డిజైన్‌ను మారిస్తే ఊర్కోమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పును విరమించుకోవడంతో పాటు నిజామాబాద్ జిల్లాలో 70 శాతం వరకు పూర్తయిన 20, 21, 22 ప్యాకేజీ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిజామాబాద్ జిల్లా బినోల నుంచి నవీపేట వరకు 14 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం నవీపేటలో నిర్వహించిన సభలో ఉత్తమ్ మాట్లాడారు. రాష్ర్టంలో జరిగిన రైతుల ఆత్మహత్యలకు టీఆర్ఎస్ సర్కారే బాధ్యత వహించాలని, ప్రభుత్వ లోపభూయిష్ట విధానాల వల్లే ఆత్మహత్యలు జరిగాయని జాతీయ నేరాల నమోదు సంస్థ(ఎన్సీఆర్బీ) నివేదిక సైతం తప్పుబట్టిం దని గుర్తు చేశారు. ఏకకాలంలో రుణమాఫీ చేసే వరకు ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. నాడు జాతీయ హోదా కావాలని పట్టుబడినవారు నేడు ఆ డిజైన్ బాగాలేదనడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు. రుణమాఫీ.. నవ్వులపాలు: భట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని నవ్వులపాలు చేస్తోందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క ధ్వజమెత్తారు. 25 శాతం చొప్పున ఐదేళ్లపాటు ఇలా రుణమాఫీని సాగదీస్తే కేవలం వడ్డీ మాత్రమే మాఫీ అయి.. అసలు అలాగే మిగులుతుందని అంకెలతో సహా వివరించారు. రుణమాఫీ పత్రాలను రైతులకు ఇస్తున్నామని సంబంధిత శాఖమంత్రి ప్రకటించడం హాస్యాస్పదమ న్నారు. పత్రాలను అందిస్తామని బ్యాంకర్లతో చెప్పించాలని డిమాండ్ చేశారు. కొత్త హామీలతో సర్కార్ మోసం: జానా అమాయక ఓటర్లను మోస పూరిత హామీలతో ఆకట్టుకుని టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిం దని కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత జానారెడ్డి విమర్శించారు.బోధన్‌లోని ఎన్‌ఎస్‌ఎఫ్‌ని ప్రభుత్వపరం చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని, చెరకు రైతుల రూ.28 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రామచంద్ర కుంతియా, శాసనసభ కాంగ్రెస్ పక్ష ఉపనేత తాటిపర్తి జీవన్‌రెడ్డి, జె.గీతారెడ్డి, శాసనమండలి కాంగ్రెస్ పక్షనేత షబ్బీర్ అలీ, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఎమ్మెల్యేలు సంపత్‌కుమార్, రాంమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అనిల్, మాజీ ఎంపీ మధుయాష్కీ, రాష్ట్ర యువజన కాంగ్రస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్, డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ తదితరులు పాల్గొన్నారు. -
హస్తినకు ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా నియమితులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఆయన ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్ తో సహా పలువురు సీనియర్ నేతలను కలవనున్నారు. పీసీసీ అధ్యక్ష బాధ్యతలు తనకు ఇచ్చినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలపనున్నట్లు సమాచారం. కాగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి టీ.పీసీసీ పగ్గాలు ఇవ్వటం వెనక రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ చక్రం తిప్పినట్లు సమాచారం. -
'పదవి కట్టబెట్టారు.. ధన్యవాదాలు'
పీసీసీ అధ్యక్ష బాధ్యతలు తనకు ఇచ్చినందుకు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలిపారు. ఆచరణ సాధ్యం కాని ఆకర్షణీయ హామీలు ఇవ్వడం వల్లే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిందని, ఆ హామీల అమలుకు టీఆర్ఎస్ సర్కారుపై ఒత్తిడి పెంచుతామని ఉత్తమ్ చెప్పారు. ఒకే జిల్లా, ఒకే సామాజికవర్గానికి కీలక పదవులు ఇస్తున్నారన్న అసంతృప్తి ఏదీ పార్టీలో లేదని, పార్టీలో సామాజిక న్యాయాన్ని హైకమాండ్ అమలుచేస్తుందని ఆయన చెప్పారు. సీనియర్లందరినీ కలుపుకొని వెళ్లి అధికార టీఆర్ఎస్పై పోరాడుతామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు.