'ఇజ్రాయెల్ సైన్యంతో పోల్చడం సరికాదు'
హైదరాబాద్ : భారత సైన్యాన్ని ఇజ్రాయెల్ సైన్యంతో పోల్చడం సరికాదని పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ....రాజ్యాంగాన్ని కాపాడాల్సిన పెద్ద మనుషులే ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 47 మంది ప్రజాప్రతినిధులను సీఎం కేసీఆర్ కొనుగోలు చేసి టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రజలను మతల పరంగా చీల్చడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. అందుకే అయోధ్య వివాదాన్ని మరోసారి తెరపైకి తెచ్చిందని ఉత్తమ్ మండిపడ్డారు.