తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా నియమితులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఆయన ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్ తో సహా పలువురు సీనియర్ నేతలను కలవనున్నారు. పీసీసీ అధ్యక్ష బాధ్యతలు తనకు ఇచ్చినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలపనున్నట్లు సమాచారం. కాగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి టీ.పీసీసీ పగ్గాలు ఇవ్వటం వెనక రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ చక్రం తిప్పినట్లు సమాచారం.
హస్తినకు ఉత్తమ్ కుమార్ రెడ్డి
Published Tue, Mar 3 2015 10:01 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement