మీడియా సమవేశంలో మాట్లాడుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ రాష్ట్ర ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను పట్టించుకోవడం లేదని పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నాలుగేళ్లుగా కనీసం వారికి అనుమతి కూడా ఇవ్వలేదని అన్నారు. మొన్న మే నెలలో ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలను జూన్‌లో ఐఆర్, ఆగస్టులో పీఆర్‌సీని ఇస్తామని ఇంత వరకు అమలు చేయలేదన్నారు. ఆర్టీసీ కార్మికులకు 16 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ఇస్తామనడం న్యాయామా అని ప్రశ్నించారు.
హాస్పిటల్స్ బిల్లులు పెండింగ్‌లో ఉండటం వల్ల ఉద్యోగుల ఆరోగ్య కార్డులు చెల్లుబాటు కావడం లేదన్నారు. ఉద్యోగులకు పది రోజులు కర్మకాండల సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసేలా ఒప్పకోవాలని అన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసే అధికారం రాష్ట్రానిదేనని, ఐఆర్‌టీలో ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసిందని అన్నారు. ఇది తెలంగాణ పబ్లిక్ సర్వీస్‌లో స్పష్టంగా ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మాత్రం ఏ రాష్ట్రం సర్వే చేసాడో తమకు తెలియడం లేదని ఆయన ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment