
న్యూఢిల్లీ : పీసీసీ పీఠంపై ఆశలు పెంచుకున్న ఆశావాహులకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ షాక్ ఇచ్చారు. అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ప్రాంతీయ కమిటీలను యథాతథంగా కొనసాగించాలని ఆయన శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని దక్కించుకొనేందుకుగాను కొంతకాలంగా పార్టీ సీనియర్లు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ పిసీసీ పీఠం కోసం తెలంగాణలో ఉత్తమ్ కుమార్ స్థానంలో తమకు అవకాశం కల్పించాలని, అలా అయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తామని బహిరంగంగానే ప్రకటనలు చేశారు. ఈ మేరకు హైకమాండ్‌కు విజ్ఞప్తులు కూడా చేశారు. అయితే రాహుల్ తాజా నిర్ణయం వారికి నిరాశ కలిగించిందనే చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ ఆయా కమిటీలే కొనసాగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment