పొన్నాల ఔట్, టీ. పీసీసీ చీఫ్గా ఉత్తమ్ | ponnala lakshmaiah out, uttam kumar reddy will be new chief of Telanana pcc | Sakshi
Sakshi News home page

పొన్నాల ఔట్, టీ. పీసీసీ చీఫ్గా ఉత్తమ్

Published Sat, Feb 28 2015 12:50 PM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

పొన్నాల ఔట్, టీ. పీసీసీ చీఫ్గా ఉత్తమ్ - Sakshi

పొన్నాల ఔట్, టీ. పీసీసీ చీఫ్గా ఉత్తమ్

హైదరాబాద్ : కాంగ్రెస్ అధిష్టానం పొన్నాల లక్ష్మయ్యకు వేటు వేసింది. ఆయనకు ఊహించని షాక్ తగిలింది. పొన్నాల లక్ష్మయ్యను తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. తెలంగాణ పీసీసీ చీఫ్గా పార్టీ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించింది. హుజూర్ నగర్ నుంచి  ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ...కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు.  


మరోవైపు టీ.సీఎల్పీ నేత జానారెడ్డిని తక్షణమే హస్తినకు రావాలని హైకమాండ్ ఆదేశించింది.  కాగా పొన్నాల పనితీరుపై కాంగ్రెస్ అధిష్టానం కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఆయన నాలుగు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు.  అయినా పొన్నాలకు టెన్ జన్పథ్ అపాయింట్మెంట్ దొరకలేదు.  పొన్నాలతో పాటు పలువురు సీనియర్ నేతలు ఢిల్లీలోనే ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement