నేడు ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు | telangana congress leaders delhi tour today | Sakshi
Sakshi News home page

నేడు ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు

Dec 14 2015 9:43 AM | Updated on Sep 19 2019 8:44 PM

తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు ఢిల్లీ నుంచి పిలుపువచ్చింది.

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు ఢిల్లీ నుంచి పిలుపువచ్చింది. కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ అయ్యేందుకు నాయకులు సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్తో భేటీ కానున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరడం, ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇప్పటికే సగం సీట్లు అధికారపార్టీ కైవసం చేసుకోవడంపై చర్చించేందుకు పిలిచినట్లు తెలుస్తుంది. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను నేతలు రచించే అవకాశముంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, దానం నాగేందర్ తదితరులు ఢిల్లీకి వెళ్లనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement