ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపై తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో అంతర్మథనం మొదలైంది.
హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపై తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో అంతర్మథనం మొదలైంది. పోటీ చేసి తప్పు చేశామనే భావనలో టీ.కాంగ్రెస్ నేతలు ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్లో లోపించిన ముందస్తు వ్యూహం లేకపోవటం, హడావుడిగా ఎన్నికల బరిలోకి దిగడం, ఏమాత్రం ఇమేజ్ లేని అభ్యర్థులను బరిలోకి దించడం వల్లే కాంగ్రెస్ ఓటమిని చవిచూశామని నేతలు అభిప్రాయపడుతున్నారు.