
టీ.కాంగ్రెస్ నేతల పోటాపోటీ లాబీయింగ్
న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రా కాంగ్రెస్ నేతలు తమ శక్తిమేరకు హస్తినలో పోటాపోటీగా లాబీయింగ్ చేస్తున్నారు. టీ.కాంగ్రెస్లో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అలాగే అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం ఇంతవరకూ పీసీసీని సంప్రదించలేదు. దాంతో ఎమ్మెల్సీ సీటుపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ నేతలంతా ఢిల్లీకి క్యూ కట్టారు. కాగా ఎమ్మెల్సీల నామినేషన్ల గడువు ఎల్లుండితో ముగియనుంది. మరోవైపు టీఆర్ఎస్, బీజేపీ కూడా తమ అభ్యర్థుల ఎంపిక విషయంలో కసరత్తు చేస్తోంది.