ప్రచారం మరిచి సీఎం సీటు కోసం కుమ్ముకున్నారు
హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్లపై తెలంగాణ పీసీసీ నేతలు మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించారే తప్ప, కార్యకర్తలను ఏనాడూ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినా ఆ క్రెడిట్ను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రచారం మరచి ముఖ్యమంత్రి సీటు కోసం పోటీపడ్డారని వ్యాఖ్యానించారు. ఎవరికి వారు అధికారం కోసం పాకులాడుతున్నారని వ్యాఖ్యలు చేశారు.
సరైన నాయకత్వం లేకపోవటం వల్లే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని, తెలంగాణలో సోనియా గాంధీ సభలు విఫలం అవడానికి మాజీమంత్రులు, సీనియర్లే కారణమని ధ్వజమెత్తారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి పదవి నుంచి పొన్నాలను దించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమిష్టి నాయకత్వంలతో ముందుకు వెళితేనే పార్టీ బలోపేతం అవుతుందని పలువురు తెలంగాణ పీసీసీ నేతలు పేర్కొన్నారు.