సోనియా నాయకత్వంపై విశ్వాసం ప్రకటించిన నేతలు | telangana congress leader meets in gandhi bhavan | Sakshi
Sakshi News home page

సోనియా నాయకత్వంపై విశ్వాసం ప్రకటించిన నేతలు

Published Tue, May 20 2014 12:30 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

telangana congress leader meets in gandhi bhavan

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సోనియాగాంధీ నాయకత్వంపై తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు విశ్వాసం ప్రకటించారు. దేశాభివృద్ధికి సోనియా నాయకత్వం బలపరుస్తూ మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తీర్మానం ప్రతిపాదించగా, మిగతా నేతలు ఏకగ్రీవంగా ఆమోదించారు.  సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సమీక్షించేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు  మంగళవారం గాంధీభవన్లో సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా దేశాభివృద్ధికి సోనియా నాయకత్వం కావాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సమావేశానికి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఓడిన అభ్యర్థులతో పాటు, పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ భేటీకి పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, జానారెడ్డి, రేణుకా చౌదరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, చిన్నారెడ్డి, జయసుధ తదితరులు హాజరయ్యారు. కాగా తెలంగాణలో కాంగ్రెస్ 21 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement