'బాబు, కేసీఆర్ మధ్య రహస్య ఒప్పందం' | 'secret agreement between chandrababu and kcr' | Sakshi
Sakshi News home page

'బాబు, కేసీఆర్ మధ్య రహస్య ఒప్పందం'

Published Fri, Oct 23 2015 3:52 PM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

'బాబు, కేసీఆర్ మధ్య రహస్య ఒప్పందం' - Sakshi

'బాబు, కేసీఆర్ మధ్య రహస్య ఒప్పందం'

హైదరాబాద్: ఓటుకు కోట్లు, ఫోన్ ట్యాపింగ్ కేసులపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కే చంద్రశేఖర్ రావుల మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు, కేసీఆర్ల మధ్యవర్తి ఎవరనేది త్వరలో బయటపెడతామని చెప్పారు.

ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం తెలుగు ప్రజలను నిరాశపరిచిందని, ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించకపోవడం అన్యాయమని  కాంగ్రెస్ నేతలు అన్నారు. రాష్ట్ర విభజన సరిగా జరగలేదన్న మోదీ ప్రకటనను కేసీఆర్ వ్యతిరేకించకపోవడం తెలంగాణ అమరవీరుల త్యాగాన్ని అవమానపరచడమేనని, మోదీ పాదాల వద్ద తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ, చంద్రబాబు, కేసీఆర్ అబద్ధాల కిలాడీలేనని షబ్బీర్ అలీ, పొంగులేటి విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement