Secret agreement
-
చైనాకు యాపిల్ సీఈవో దాసోహం!
Apple CEO Tim Cook Secretly Signed 275 Billion Deal With China: గ్లోబల్ మార్కెట్లో అమెరికా-చైనా మధ్య జరిగే ట్రేడ్ వార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది ఈ నాటిది కాదు. ‘దేశభక్తి’ నినాదంతో చైనా ఉత్పత్తులను నిషేధించాలని ప్రయత్నించే అమెరికా.. దానికి కఠిన ఆంక్షలతో సమానమైన కౌంటర్ ఇచ్చే చైనా.. వెరసి గ్లోబల్ ట్రేడింగ్‌లో దేశాలు పరస్పరం ఒకదానినొకటి దశాబ్దాలుగా కిందటి లాగేసుకుంటాయి. ఈ తరుణంలో యాపిల్ సీఈవో టిమ్ కుక్ చేసిన నిర్వాకం ఒకటి తాజాగా వెలుగు చూసింది. అమెరికన్ కంపెనీ యాపిల్ సీఈవో టిమ్ కుక్.. చైనాతో 275 బిలియన్ డాలర్ల రహస్య ఒప్పందం చేసుకున్నాడు. యాపిల్ డివైజ్‌లు, సేవలపై చైనా ప్రభుత్వం నుంచి ఆంక్షలు ఎదురుకాకుండా ఉండేందుకు.. చైనాను శాంతిపజేసేందుకు ఈ ఒప్పందం చేసుకున్నట్లు మంగళవారం టెక్నాలజీ న్యూస్ వెబ్సైట్ ‘ది ఇన్ఫర్మేషన్’ ఓ కథనం ప్రచురించింది. 2016లో చైనా పర్యటన సందర్భంగా టిమ్ కుక్ ఈ భారీ ఒప్పందం కుదుర్చుకున్నాడని, నియంత్రణ చర్యలు తప్పించుకునేందుకే అధికారులతో లాబీయింగ్‌లో భాగంగా ఐదేళ్ల ఒప్పందం చేసుకున్నట్లు ఆ కథనం పేర్కొంది. అంతేకాదు యాపిల్ డివైజ్‌లలో చైనాకు చెందిన కాంపోనెంట్స్‌ను ఎక్కువగా వాడడం, చైనీస్ సాఫ్ట్వేర్ కంపెనీలతో ఒప్పందాలు, చైనా యూనివర్సిటీలకు చెందిన సాంకేతికతనే వాడడం, చైనా కంపెనీల్లోనే నేరుగా పెట్టుబడుల.. ఇలాంటి షరతులకు సైతం టిమ్ కుక్ ఒప్పుకున్నట్లు ఆ కథనం తెలిపింది. రిటైల్ స్టోర్స్, రీసెర్చ్ & డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు, రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసమే ఆ ఒప్పందం చేసుకున్నట్లు ది ఇన్ఫర్మేషన్ కథనం పేర్కొంది. ఈ ఒప్పందం 2021లోనే ముగియాల్సి ఉండగా.. అధ్యక్షుడు జిన్ పింగ్ తెచ్చిన చట్టాల పరిధిలోకి చేరడం వల్ల వచ్చే ఏడాది చివరినాటిదాకా పొడిగించినట్లయ్యింది. దేశభక్తి విమర్శ అమెరికా కంపెనీలన్నీ ఒకదారి అయితే.. యాపిల్ మరోదారిలో పయనించడం విమర్శలకు తావిచ్చింది. ఊహించని ఈ స్నేహ హస్తం మీద చర్చలూ జరుగుతున్నాయి. సాధారణంగా అమెరికన్ కంపెనీలు ఒప్పందాలకు దూరంగా ఉంటూనే.. చైనా మార్కెట్‌ను క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటాయి. దేశభక్తిని హైలెట్ చేస్తూ తమ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తుంటాయి. ఇక ట్రంప్ హయాంలో అయితే యాపిల్ సైతం అమితమైన దేశభక్తిని ప్రదర్శించింది కూడా!. ఈ తరుణంలోనే చైనా విధిస్తున్న కఠిన వాణిజ్య-వ్యాపార నిబంధనలను అంగీకరించలేక.. ఆ దేశం నుంచి బయటకు వచ్చేస్తున్నాయి అమెరికా కంపెనీలు. అయితే యాపిల్ మాత్రం ఇందుకు భిన్నంగా రహస్య ఒప్పందం చేసుకుందన్న కథనం కలకలం సృష్టిస్తోంది. ఇక చైనాలో విదేశీ కంపెనీల వ్యాపారం మొత్తంలో యాపిల్ వాటానే(83 శాతం) ఎక్కువగా ఉంటోంది. అందుకే యాపిల్ ఇలా రహస్య ఒప్పందాలకు సిద్ధపడిందన్న వాదనా వినిపిస్తోంది. ఏదిఏమైనా ఆంక్షలకు, కఠిన నిబంధనలకు-చట్టాలకు భయపడి.. చైనాకు దాసోహమైన టిమ్ కుక్ వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కథనంపై యాపిల్ నుంచి స్పందన రావాల్సి ఉంది. -
టీడీపీ– జనసేన లోపాయికారి ఒప్పందం!
చంద్రుడి వైపే పవనం సాగుతోందా..? టీడీపీ– జనసేన మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందా..? రెండు పార్టీల నడుమ గాఢానుబంధం కొనసాగుతోందా..? ఇరువురు నేతలూ స్వలాభం కోసం ప్రజాసంక్షేమాన్ని విస్మరిస్తారా..? వ్యక్తిగత ప్రయోజనాల కోసం విలువలను గాలికి వదిలేస్తారా..? ఓట్ల కోసం రాష్ట్రాభివృద్ధినే తాకట్టుపెడతారా..? నాటి మాటలన్నీ నీటిమూటలేనా..? కమలనాథులకు తెలిసే తంతు జరుగుతోందా..? ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఎంతకైనా తెగిస్తారా..? శ్రీకాళహస్తిలో బాబు ప్రసంగం వింటే అవుననే అనిపిస్తుంది.. తిరుపతిలో పవన్‌కల్యాణ్ ఉపన్యాసాన్ని ఆలకిస్తే లోగుట్టు అర్థమవుతుంది. సాక్షి, తిరుపతి: టీడీపీ– జనసేన అధినేతల వ్యవహారశైలి అనుమానాస్పదంగా తయారైంది. మొన్న తిరుపతిలో పర్యటించిన పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో చంద్రబాబును పల్లెత్తు మాట అనలేదు. నిన్న శ్రీకాళహస్తిలో ప్రచారం చేసిన ‘నారా’ వారు జనసేన అధినేతపై నోరెత్తలేదు. ఇరువురు నేతలూ కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విమర్శలు గుప్పించేందుకే పరిమితమయ్యారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ– జనసేన పొత్తు కుదుర్చుకుని ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాయి. లెక్కప్రకారమైతే వారికి వైఎస్సార్సీపీ ఎంతో టీడీపీ కూడా అంతే కావాలి. ఇందుకు విరుద్ధంగా కేవలం అధికార పార్టీపైనే విమర్శలు కురిపించడంపై ప్రజలు విస్తుబోతున్నారు. ముఖ్యంగా టీడీపీ– జనసేన లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదు సార్వత్రిక ఎన్నికల నుంచి టీడీపీ, జనసేన ఏమాత్రం గుణపాఠం నేర్చుకోలేదు. కుయుక్తులను ప్రజలు హర్షించరనే వాస్తవాన్ని గ్రహించలేదు. పాత పంథాలో కుట్ర రాజకీయాలకే ప్రాధాన్యమిస్తున్నారు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా బాబు, పవన్ ప్రచార సభలే నిలుస్తాయని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. 2014 ఎన్నికల ప్రచారానికి వచ్చిన మోదీ తిరుపతిలో ప్రత్యేక హోదా హామీ ఇచ్చినప్పుడు ఈ ఇద్దరు పెద్దమనుషులు ఆ వేదికపైనే ఉన్నారని, కానీ, ప్రస్తుతం ఇరువురూ తమ ప్రసంగాల్లో ఆ ఊసే ఎత్తలేదని ఆరోపిస్తున్నారు. చీకటి ఒప్పందాలతో ముందుకు వస్తున్న విపక్ష పార్టీలకు ప్రజలు తగిన బుద్ధిచెబుతారని విశ్లేషిస్తున్నారు. ఉప ఎన్నికలో ఘోర ఓటమి తప్పదని రాజకీయ పండితులు పేర్కొన్నారు. చదవండి: జనసేనకు షాక్! మాదాసు గంగాధరం రాజీనామా పాచిపోయిన లడ్డూలు పవన్‌కు రుచిగా ఉన్నాయా? -
కేసీఆర్, బీజేపీల మధ్య రహస్య ఒప్పందం: జైపాల్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్, భారతీయ జనతా పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని కేంద్ర మాజీమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి ఆరోపించారు. ప్రగతిశీలశక్తులు, అల్ప సంఖ్యాక వర్గాలను మోసం చేసేందుకే కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అన్నారు. శనివారం గాంధీభవన్‌లో జైపాల్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ నోట్ల రద్దుతోపాటు అనేక అంశాల్లో కేసీఆర్ బీజేపీకి మద్దతిచ్చారని, సిద్ధాంతపరంగా వారి మధ్య రహస్య అవగాహన ఉందన్నారు. 2014లోనే బీజేపీతో సర్దుకుపోయేందుకు ప్రయత్నించారని, అయినా టీడీపీ, బీజేపీలు టీఆర్ఎస్ను తిరస్కరించాయని చెప్పారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో బీజేపీతో విడిపోయినా ఎన్నికల తర్వాత కేసీఆర్ బీజేపీతో కచ్చితంగా కలుస్తారని జోస్యం చెప్పారు. ఏకవచనంతో మాట్లాడటం కేసీఆర్‌కు అలవాటేనని, మోదీనే కాదు రాహుల్‌గాంధీని కూడా ఆయన ఏకవచనంతోనే సంబోధించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలపై తానెప్పుడూ బయట మాట్లాడలేదని, ఆ అలవాటు తనకు లేదని చెప్పిన జైపాల్ తాను ఈసారి ఎన్నికల్లో మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేస్తానని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
‘విభజన’పై పార్లమెంటులో పోరాడరేం: పొన్నం
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య జరిగిన రహస్య ఒప్పందం వల్లే హైకోర్టు విభజనలో జాప్యం జరుగుతోందని మాజీ ఎంపీ, తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ‘కేసీఆర్ ప్రత్యేక హైకోర్టు పోరాటం పేరుతో న్యాయవాదులను మోసం చేస్తున్నారు. ఢిల్లీలో ధర్నా చేస్తానని ప్రకటించిన కేసీఆర్.. టీఆర్ఎస్ ఎంపీలు హైకోర్టు విభజన కోసం పార్లమెంటులో ఎందుకు పోరాటం చేయడం లేదో చెప్పాలి. ప్రత్యేక హైకోర్టు కోసం ప్రభుత్వం చేసే పోరాటానికి మేం మద్దతిస్తాం..’ అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం గురించి తెలుసుకొని కేటీఆర్ మాట్లాడాలని, కాంగ్రెస్‌ను విమర్శించే అర్హత ఆయనకు లేదన్నారు. -
ఆ పార్టీల మధ్య రహస్య ఒప్పందం: సోనియా
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే - కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మధ్య రహస్యం ఒప్పందం ఉందని ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ ఆరోపించారు. అందుకే కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అన్నాడీఎంకే వ్యతిరేకించడం లేదని మండిపడ్డారు. డీఎంకే-కాంగ్రెస్ కూటమి అభ్యర్థులకు మద్దతుగా చెన్నై, ఐలాండ్ మైదానంలో గురువారం సాయంత్రం బహిరంగ సభ జరిగింది. ఇందులో సోనియాగాంధీ, డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఒకే వేదిక మీద నుంచి ప్రసంగించారు. డీఎంకే , కాంగ్రెస్‌లు ప్రజాహితాన్ని కాంక్షించే పార్టీలని, తమ ద్వారానే రాష్ర్ట ప్రగతి సాధ్యం అని కరుణానిధి వ్యాఖ్యానించారు. అంతకుముందు పుదుచ్చేరి ప్రచారంలో సోనియాఅక్కడి ఎన్ఆర్ కాంగ్రెస్‌పై విరుచుకు పడ్డారు. -
'బాబు, కేసీఆర్ మధ్య రహస్య ఒప్పందం'
హైదరాబాద్: ఓటుకు కోట్లు, ఫోన్ ట్యాపింగ్ కేసులపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కే చంద్రశేఖర్ రావుల మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు, కేసీఆర్‌ల మధ్యవర్తి ఎవరనేది త్వరలో బయటపెడతామని చెప్పారు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం తెలుగు ప్రజలను నిరాశపరిచిందని, ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించకపోవడం అన్యాయమని కాంగ్రెస్ నేతలు అన్నారు. రాష్ట్ర విభజన సరిగా జరగలేదన్న మోదీ ప్రకటనను కేసీఆర్ వ్యతిరేకించకపోవడం తెలంగాణ అమరవీరుల త్యాగాన్ని అవమానపరచడమేనని, మోదీ పాదాల వద్ద తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ, చంద్రబాబు, కేసీఆర్ అబద్ధాల కిలాడీలేనని షబ్బీర్ అలీ, పొంగులేటి విమర్శించారు. -
విభజనకు బాబు చీకటి ఒప్పందం
ఏలూరు, న్యూస్‌లైన్ : రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే 20ఏళ్ళపాటు తమ పార్టీల భవిష్యత్తు అంధకారంలో మగ్గిపోతుందనే భయంతోనే సోనియాగాంధీ, చంద్రబాబు చీకటి ఒప్పందాలు చేసుకుని రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు కుట్ర పన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ళనాని పేర్కొన్నారు. వైఎస్ జగన్ నిరవధిక దీక్ష భగ్నానికి నిరసనగా ఏలూరులో ఆళ్ళనాని చేపట్టిన రెండు రోజుల మౌన నిరాహార పాదయాత్ర చివరి రోజైన ఆదివారం నగర ప్రజలు నీరాజనాలు పలికారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ సుమారు 18 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు డప్పులు, వాయిద్యాలతో పెద్దెత్తున పాల్గొన్నారు. ఏలూరులోని 21డివిజన్లలో వైఎస్సార్సీపీ నాయకులు ఏర్పాటు చేసిన నిరాహారదీక్ష శిబిరాలను ఆయన పాదయాత్రగా వెళ్ళి సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. పాదయాత్ర ముగింపు సభలో ఆళ్ళనాని మాట్లాడుతూ సీమాంధ్ర ప్రాంతంలో కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా ప్రజలంతా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారని, దీనికి భిన్నంగా వ్యవహరిస్తే క్షమించరని హెచ్చరించారు. సీమాంధ్ర ప్రజల కష్టంతో హైదరాబాద్‌ను అంతర్జాతీయస్థాయి నగరంగా తీర్చిదిద్దితే ఇప్పుడు తెలంగాణకు ఇచ్చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు.