‘విభజన’పై పార్లమెంటులో పోరాడరేం: పొన్నం | Ponnam Prabhakar comments on ktr | Sakshi
Sakshi News home page

‘విభజన’పై పార్లమెంటులో పోరాడరేం: పొన్నం

Published Fri, Jul 22 2016 12:47 AM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM

‘విభజన’పై పార్లమెంటులో పోరాడరేం: పొన్నం

‘విభజన’పై పార్లమెంటులో పోరాడరేం: పొన్నం

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య జరిగిన రహస్య ఒప్పందం వల్లే హైకోర్టు విభజనలో జాప్యం జరుగుతోందని మాజీ ఎంపీ, తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ‘కేసీఆర్ ప్రత్యేక హైకోర్టు పోరాటం పేరుతో న్యాయవాదులను మోసం చేస్తున్నారు. ఢిల్లీలో ధర్నా చేస్తానని ప్రకటించిన కేసీఆర్.. టీఆర్‌ఎస్ ఎంపీలు హైకోర్టు విభజన కోసం పార్లమెంటులో ఎందుకు పోరాటం చేయడం లేదో చెప్పాలి.

ప్రత్యేక హైకోర్టు కోసం ప్రభుత్వం చేసే పోరాటానికి మేం మద్దతిస్తాం..’ అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం గురించి తెలుసుకొని కేటీఆర్ మాట్లాడాలని, కాంగ్రెస్‌ను విమర్శించే అర్హత ఆయనకు లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement