రాజీవ్గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ముఖ్యనేతలు గురువారం పంజాగుట్టలోని రాజీవ్ విగ్రహానికి నివాళులర్పించారు.
హైదరాబాద్: రాజీవ్గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ముఖ్యనేతలు గురువారం పంజాగుట్టలోని రాజీవ్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం పంజాగుట్ట నుంచి నెక్లెస్రోడ్లోని ఇందిరా విగ్రహం వరకు టీపీసీసీ ర్యాలీ నిర్వహించారు. నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి తెలంగాణ కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధునిక భారత నిర్మాణంలో రాజీవ్గాంధీ కీలక పాత్ర షోషించారంటూ కొనియాడారు.
రాజీవ్ గాంధీ ప్రతిష్టను దెబ్బతీసేలా సుష్మాస్వరాజ్ లాంటి పెద్దలు మాట్లాడటం దుర్మార్గమని విమర్శించారు. మత సమరస్యం కోసం రాజీవ్గాంధీ చేపట్టిన సద్భావన యాత్ర దేశానికి ఆదర్శమన్నారు. గాంధీ భవన్, ఇందిరాభవన్లోనూ రాజీవ్ గాంధీకి నివాళుర్పించారు.