'అది కేసీఆర్ సొంత వ్యవహారం కాదు'
హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును సాధించేందుకు పోరాటం చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నిర్ణయించారు. ప్రాణహిత ప్రాజెక్టును తుమ్మిడిహట్టి నుంచి మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఐక్య ఉద్యమ కార్యాచరణ ప్రకటించాలని తెలంగాణ పీసీసీ భావిస్తోంది.
ఈ ప్రాజెక్టుపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా శాసనసభలో చర్చించాలని, ఇది కేసీఆర్ సొంత విషయం కాదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ప్రాజెక్టును మరోచోటికి మారిస్తే ఖజానా భారీ నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.