తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఢిల్లీ బాటపట్టారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు పలువురు పార్టీ నేతలు శనివారం ఢిల్లీ బయల్దేరారు.
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఢిల్లీ బాటపట్టారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు పలువురు పార్టీ నేతలు శనివారం ఢిల్లీ బయల్దేరారు. కాంగ్రెస్ సభ్యత్వ నమోదు వివరాలను ఉత్తమ్ ....ఏఐసీసీకి సమర్పిస్తారు. అలాగే తాను గత ఆరు నెలల్లో చేపట్టిన కార్యక్రమాలపై సోనియా, రాహుల్‌గాంధీకి ఆయన నివేదిక ఇవ్వనున్నారు. వరంగల్ పార్లమెంట్ స్థానానికి జరిగే ఉపఎన్నిక , కాంగ్రెస్ అభ్యర్ధి ఎంపికపై కూడా ఉత్తమ్ హైకమాండ్ పెద్దలతో కసరత్తు చేయనున్నారు. ఇక ఆదివారం ఢిల్లీ రాంలీలా మైదాన్‌లో ఏఐసీసీ నిర్వహించే కిసాన్ ర్యాలీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు పాల్గొంటారు.