తెలంగాణ కాంగ్రెస్ పార్టీ(పీసీసీ)తో తనకు విభేదాలు లేవని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు.
నల్లగొండ: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ(పీసీసీ)తో తనకు విభేదాలు లేవని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. బుధవారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండించారు.
కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. 2019లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి జోస్యం చెప్పారు.