
నోటీసులు ఎందుకు పంపారు?
నల్లగొండ: తనకు షోకాజ్ నోటీసులు పంపడంపై తెలంగాణ సీఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పీసీసీ క్రమశిక్షణ సంఘం తనకు పంపిన నోటీసులను పట్టించుకోనని అన్నారు. తాను పీసీసీనే పట్టించుకోవడం లేదని, అలాంటప్పుడు నోటీసులేంటని ఆయన ప్రశ్నించారు. తాను పీసీసీనే పట్టించుకోవడం లేదని, అలాంటప్పుడు నోటీసులు ఎందుకు పంపారని ఆయన ప్రశ్నించారు.
ఉత్తమ్ కుమార్ అసమర్థత వల్లే పార్టీకి వరుస ఓటములు ఎదురవుతున్నాయని మండిపడ్డారు. పనికిరాని పీసీసీ చీఫ్ కింద పనిచేయను అని స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఉత్తమ్ ను తప్పించాలని డిమాండ్ చేశారు. షోకాజ్ నోటీసు ఇచ్చే సత్తా రాష్ట్ర కాంగ్రెస్ లో ఎవరికీ లేదని కోమటిరెడ్డి అన్నారు. ఉత్తమ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనకు పీసీసీ షోకాజ్ నోటీసులు పంపింది.