పీసీసీ చీఫ్ రేసులో లేను: వివేక్
కరీంనగర్ : పీసీసీ అధ్యక్ష పదవి రేసులో లేనని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వివేక్ స్పష్టం చేశారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ రుణమాఫీ వల్లే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని అన్ఓనారు. రైతులకు తొమ్మిది గంటల విద్యుత్ ఇవ్వాల్సిందేనని వివేక్ డిమాండ్ చేశారు. మరోవైపు మాజీమంత్రి డీకే అరుణ.... తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి కోసం తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పొన్నాల లక్ష్మయ్యను పదవి నుంచి తప్పించనున్నట్లు సంకేతాలతో ఆమె గత మూడు రోజులుగా హస్తనలోనే మకాం వేసి...అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు.