సాక్షి, న్యూఢిల్లీ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో టీఆర్‌ఎస్, ఎంఐఎం రహస్య పొత్తు పెట్టుకున్నాయమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరోసారి ఆరోపించారు. మేయర్ ఎన్నికతో వారి బండారం బయటపడుతుందని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో నగర ఓటరు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. టీఆర్ఎస్-55, బీజేపీ-48, ఎంఐఎం-44, కాంగ్రెస్-2 స్థానాల్లో విజయం సాధించింది. మేయర్ పీఠం కోసం ఎంఐఎంతో టీఆర్‌ఎస్ పొత్తు పెట్టుకుంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో శనివారం ఈ అంశంపై కిషన్ రెడ్డి వ్యగ్యంగా స్పందించారు. ‘కేసీఆర్, అసదుద్దీన్ ఒవైసీ కలిసి బిర్యానీ తింటారు’ అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
(చదవండి : బీజేపీ గెలుపు తాత్కాలికమే : ఒవైసీ)
‘హైదరాబాద్ ఒక మిని తెలంగాణ. అక్కడ ప్రజలు బీజేపీకి 48 సీట్లు ఇచ్చి ఆశీర్వదించారు. ఈ ఫలితాలు అధికార టీఆర్‌ఎస్‌కు చెంపపెట్టు. తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోందని తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపును ఒవైసీ కానీ, కేసీఆర్ ఆపలేరు’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment