
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక సూచన చేసింది. ఝాన్సీ బజార్, పురానాపూల్ డివిజన్లలో నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి(ఎస్ఈసీ) సూచించింది. ఝాన్సీ బజార్, పురానాపూల్ డివిజన్లలో రీపోలింగ్ నిర్వహించాలని అక్కడి బీజేపీ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ రెండు డివిజన్లలో ఎంఐఎం పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడిందని బీజేపీ ఆరోపించింది. దీంతో రీపోలింగ్ నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని ఎస్‌ఈసీకి హైకోర్టు సూచించింది. అయితే రేపే ఎన్నికల కౌంటింగ్ ఉండడంతో ఈ అంశం మీద ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది ఆసక్తికరంగా మారింది.
(చదవండి : జీహెచ్‌ఎంసీ ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు )
Comments
Please login to add a commentAdd a comment