puranapool division
-
400 సంవత్సరాల చరిత్ర.. కులీకుత్‌బ్‌షా, భాగమతి ప్రేమకు చిహ్నం..
సాక్షి, జియాగూడ: ప్రపంచంలోనే ఏకైక ప్రేమికుల వారధిగా పురానాపూల్ వంతెన ప్రేమకు సాక్షిగా నిలిచింది. ఇక్కడి నుంచే భాగ్యనగర నిర్మాణానికి పునాది పడింది. ఎన్నో విశేషాలతో నిర్మించిన ఈ చారిత్రక వారధి నిర్లక్ష్యానికి గురవుతోది. కట్టడానికి ఎలాంటి భద్రత లేదు. ప్రేమికుల వారధిగా గుర్తింపు పొందిన ఈ వారిదిపై ప్రభుత్వం 2000 సంవత్సరంలో ప్రేమికుల దినోత్సవాన్ని నిర్వహించింది. ప్రభుత్వం దీనిని పర్యాటక ప్రాంతంగా గుర్తించాలని పలువురు కోరుతున్నారు. కులీకుత్‌బ్‌షా, భాగమతి ప్రేమకు చిహ్నం.. గోల్కొండ యువరాజు మహ్మద్ కులీకుత్‌బ్‌షా పరవళ్లు తొక్కుతున్న మూసీనది అవతలి ఒడ్డన్న నివసించే భాగమతి ప్రేమలో పడ్డాడు. తండ్రి సుల్తాన్ ఇబ్రహీం కులీ కుత్బ్షా వీరి ప్రేమను గుర్తించి వీరి ప్రేమకు చిహ్నంగా పురానాపూల్‌ను ప్యారానాపూల్‌గా నామకరణం చేసి నిర్మించాడు. వీరి ప్రేమకు సాక్షిగా వంతెన, భాగ్యనగరం అంచెలంచెలుగా వెలిసింది. చారిత్రాత్మకమైన వంతెన.... పురానాపూల్ వంతెన కుతుబ్‌షాహీలు నిర్మించిన అద్భుత నిర్మాణాల్లో ఒకటి. అంతేకాదు హైదరాబాద్ నగరంలో నిర్మించిన మొదటి వంతెన కూడా ఇదే. ఈ వంతెన నిర్మాణం క్రీ.శ.1578లో ఇబ్రహీం కులీకుత్‌బ్‌షా నిర్మించారు. గోల్కొండ కోట నుంచి కార్వాన్ మీదుగా పాతబస్తీకి వెళ్లేందుకు ఈ వంతెనను నిర్మించారు. విదేశీయులు సందర్శన.. ఆసఫ్‌జాహీల కాలంలో హైదరాబాద్‌ను సందర్శించిన ఫ్రెంచి బాటసారి టావెర్నియర్ వంతెన నిర్మాణ శైలిని చూసి ముగ్దుడయ్యాడు. దీనిని ప్యారిస్‌లోని ఫౌంట్ న్యూప్‌తో పోల్చాడు. ఎన్నో విశేషాలతో కూడిన ఈ వంతెనను ప్రభుత్వం గుర్తించడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర టూరీజం శాఖ కిషన్‌రెడ్డి, తెలంగాణ టూరీజం మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ టూరీజం డెవలప్మెంట్ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా వంత్తెనను సందర్శించాలని పలువురు కోరుతున్నారు. సమస్యలెన్నో.. 400 ఏళ్ల నాటి ఈ నిర్మాణం నేటికీ చెక్కు చెదరలేదు. రెండు మూడు సార్లు భారీ వరదలకు కొంతమేరకు దెబ్బతిన్నప్పటికీ నిజాం పాలకులు మరమ్మతులు చేపట్టారు. ప్రస్తుతం వంతెనపై కూరగాయల మార్కెట్ కొనసాగుతోంది. పలు చోట్ల వంతెన ప్రహరీ కూడా కూలిపోయింది. వంతెన పైనే వ్యాపారులు షెడ్లు వేసుకునేందుకు ఇనుప పైపులు పాతుతున్నారు. దీంతో వంతెనకు ప్రమాదం ఏర్పడుతోంది. అలాగే వంతెన దిగువన మూసీ మురుగునీరు నిలిచి ఉండడంతో వంతెన బీటలు వారుతోంది. వంతెనపై కూరగాయల మార్కెట్ -
జీహెచ్ఎంసీ ఎన్నికలు : హైకోర్టు కీలక సూచన
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక సూచన చేసింది. ఝాన్సీ బజార్, పురానాపూల్ డివిజన్లలో నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి(ఎస్ఈసీ) సూచించింది. ఝాన్సీ బజార్, పురానాపూల్ డివిజన్లలో రీపోలింగ్ నిర్వహించాలని అక్కడి బీజేపీ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ రెండు డివిజన్లలో ఎంఐఎం పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడిందని బీజేపీ ఆరోపించింది. దీంతో రీపోలింగ్ నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని ఎస్ఈసీకి హైకోర్టు సూచించింది. అయితే రేపే ఎన్నికల కౌంటింగ్ ఉండడంతో ఈ అంశం మీద ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది ఆసక్తికరంగా మారింది. (చదవండి : జీహెచ్ఎంసీ ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ) -
మూడేళ్లుగా నిత్యనరకం
హైదరాబాద్: ఓ బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన సంఘటన హైదరాబాద్ కామాటిపురా పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితురాలి బంధువుల ఆందోళనతో ఈ విషయం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు... పురానాపూల్ మురళీనగర్ ప్రాంతానికి చెందిన బాలిక(16) ఇంటర్మీడియెట్ చదువుతోంది. బాలిక ఇంటి సమీపంలోనే ఆమె మేనత్త కుటుంబం నివాసముంటోంది. మూడేళ్ల క్రితం మేనత్త కుమారుడు రాజేశ్ బాలికకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలికి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి తాగించి గొల్లకిడికి ప్రాంతంలో స్నేహితులతో కలసి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోలను సోషల్‌మీడియాలో పెడతామని బెదిరిస్తూ మూడేళ్లుగా వారు ఆమెపై లైంగికదాడికి పాల్పడుతున్నారు. వారి వేధింపులు తాళలేక బాధితురాలు గత డిసెంబర్ 24న ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పింది. దీనిపై తండ్రి, కూతురు కలసి కామాటిపురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన ఇన్స్పెక్టర్ మల్లేశ్ నిందితులు రాజేశ్, శుభం, అభిజిత్ కౌశిక్‌లను అరెస్ట్ చేసి డిసెంబర్ 31న రిమాండ్‌కు తరలించారు. పోలీసులు ఈ కేసులో విజయ్ అనే యువకుడిని సాక్షిగా పేర్కొనడమేగాక వివరాలు బయటికి పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. విజయ్ కూడా తనపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడని, అతడిని కూడా అరెస్ట్ చేయాలని బాధితురాలు, ఆమె బంధువులు ఆదివారం పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. నిందితులను ఉరి తీయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనిపై సమాచారం అందడంతో ‘భరోసా’టీమ్ అక్కడికి చేరుకొని బాధితురాలి నుంచి వివరాలు సేకరించింది. మొత్త 10 మంది తరచూ తనపై లైంగికదాడికి పాల్పడినట్లు బాధితురాలు పేర్కొన్నట్లు సమాచారం. కఠినంగా శిక్షించాలి: అనిల్ కుమార్ యాదవ్ బాలికపై లైంగికదాడికి పాల్పడిన యువకులపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. ఆదివారం ఆయన బాధిత కుటుంబసభ్యులను పరామర్శించి మద్దతు తెలిపారు. లోతుగా దర్యాప్తు చేపట్టాలి: ఉమామహేంద్ర బాలికపై లైంగికదాడి కేసులో పోలీసులు లోతుగా విచారణ జరిపి నిందితులందరిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నగర ఉపాధ్యక్షులు ఉమామహేంద్ర అన్నారు. ఆందోళన చేస్తున్న బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి మద్దతు పలికారు. ‘బాధితురాలికి న్యాయం చేయాలి’ బాలికను బ్లాక్మెయిల్ చేస్తూ గత మూడేళ్లుగా బాలికపై లైంగిక దాడికి పాల్పడుతున్న వ్యక్తులను కఠినంగా శిక్షించాలని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షులు అచ్యుతారావు డిమాండ్ చేశారు. ఈ కేసులో సాక్షిగా పేర్కొన్న విజయ్ కూడా లైంగికదాడికి పాల్పడినట్లు బాధితురాలు చెబుతుందన్నారు. వివరాలు సేకరిస్తున్నాం: ఇన్స్పెక్టర్ బాలికపై లైంగికదాడి జరిగినట్లు గత డిసెంబర్ 24న ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసి 31న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు కామాటిపురా ఇన్స్పెక్టర్ తెలిపారు. ‘సాక్షి’గా ఉన్న విజయ్ కూడా తనపై లైంగికదాడికి పాల్పడ్డాడని, అతడిని కూడా నిందితుడిగా చేర్చాలని, మరికొందరు నిందితులు ఉన్నారని బాధితురాలు చెబుతోందన్నారు. ‘భరోసా’బృందం బాధితురాలి నుంచి పూర్తి వివరాలు సేకరిస్తోందని చెప్పారు. ఈ ఘటనపై విచారణ అధికారిగా శ్రీదేవిని నియమిస్తూ హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. -
మూడు రోజుల్లో రెండోసారి: పురానాపూల్ లో రీ పోలింగ్
హైదరాబాద్: మూడురోజుల వ్యవధిలోనే రెండోసారి ఓటేస్తున్నారు గ్రేటర్ లోని పురానాపూల్ డివిజన్ ఓటర్లు. ఫిబ్రవరి 2న జరిగిన ఎన్నికల్లో ఆ డివిజన్ లో ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ లమధ్య తలెత్తిన ఘర్షణల కారంణంగా మళ్లీ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం భావించిన దరిమిలా శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి రీపోలింగ్ ప్రారంభమైంది. 36 బూత్ లతో మొత్తం 34, 413 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుంది. మరోవైపు గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం మధ్యహ్నం 3 గంటల నుంచి ప్రారంభం కానుంది.