
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో వంద సీట్లు గెలుస్తామని చెప్పిన టీఆర్‌ఎస్ చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు ఫలితాలు వచ్చాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు కాలం చెల్లినట్లేనని అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీయే ప్రత్యామ్నాయ పార్టీ అని చెప్పారు. హైదరాబాద్ నగర ప్రజలకు బీజేపీ అండగా ఉంటుందని అన్నారు. ( జీహెచ్‌ఎంసీ ఎన్నికల విజేతలు వీరే )
కాగా, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 150 స్థానాలకు గానూ టీఆర్‌ఎస్ 56, బీజేపీ, 49, ఎమ్‌ఐఎమ్ పార్టీ 43 స్థానాలను గెలుచుకున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలకే పరిమితం కాగా, తెలుగు దేశం పార్టీ ఒక్క చోట కూడా గెలవకపోవటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment