Covid-19: Increases Corona Positive Cases In Hyderabad After GHMC Elections - Sakshi
Sakshi News home page

గ్రేటర్‌లో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు  

Published Thu, Dec 10 2020 9:08 AM | Last Updated on Thu, Dec 10 2020 1:17 PM

Coronavirus Cases Increase Again In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల పర్వం ముగిసింది. ప్రచారంలో, రోడ్‌షోలు, సభలు సమావేశాల్లో జనం ఎలాంటి భౌతిక దూరం పాటించకుండా పాల్గొన్నారు. మంగళవారం భారత్‌బంద్‌ సందర్భంగా కూడా ధర్నాలతో పాటు ఇతర కార్యక్రమాల్లో జనం కరోనా కాలాన్ని మరిచిపోయారు. లింగోజిగూడ కార్పొరేటర్‌గా విజయం సాధించిన ఆకుల రమేష్‌ గౌడ్‌కు రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో ప్రజాప్రతినిధులు, ప్రచారంలో పాల్గొన్న జనానికి కోవిడ్‌భయం పట్టుకుంది. తమకు కూడా కరోనా సోకి ఉంటుందని జనం గుబులు పడుతున్నారు. అసలే చలికాలం ఆపై జ్వరంతో ఎక్కువ మంది బాధపడుతున్నారు. కార్పొరేటర్‌కు కరోనా వచి్చందనే వార్త వైరల్‌ కావడంతో గ్రేటర్‌లో తిరిగి ఈ వ్యాధి వ్యాప్తి చెందుతోందని ఇటు వైద్య శాఖ అటు సాధారణ జనం భయాందోళనకు గురవుతున్నారు.  

కేసులు ఇలా..  
   ఎన్నికల ముందు నవంబర్‌లో రోజుకు సుమారు 100కుపైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మంగళవారం 180 మందికి కరోనా నిర్ధారణ అయింది.  
 ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వారు క్వారంటైన్‌లోకి వెళ్లక పోవడం ఆందోళన కల్గిస్తున్న అంశం. దీంతో ఈ సంఖ్య రానున్న మూడు, నాలుగు రోజుల్లో పెరిగే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. 
ఆయా రాజకీయ నాయకులతో వైరస్‌ సోకే ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు. మున్ముందు కేసుల సంఖ్యను నివారించాలంటే ప్రచారంలో పాల్గొన్న ఆయా పారీ్టల నేతలు, కార్యకర్తలు క్వారంటైన్‌లోకి వెళ్తే మంచిదని సూచిస్తున్నారు. 
వీరంతా వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి. కానీ అవేవీ పట్టనట్లుగా వీరు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. వీరంతా కచి్చతంగా క్వారంటైన్‌లో ఉండాలని డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అధికారులు చెబుతున్నారు. సాధారణ జనంతో కలిసి సంచరించడంతో కోవిడ్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.   

సెకండ్‌ వేవ్‌ ఎఫెక్ట్‌ ఉంటుందా? 
రాష్ట్రానికి సెకండ్‌ వేవ్‌ కరోనా ముప్పు పొంచి ఉందని వార్తలు వస్తున్నాయి. దీంతో మరోసారి కోవిడ్‌ వ్యాపించే ప్రమాదం ఉంది. ప్రచారంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తల ద్వారా వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం వివిధ రాజకీయ పారీ్టలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, నేతలు, అభిమానులతోపాటు ఇతర జిల్లాల నుంచి హైదరాబాద్‌కు ప్రచారం నిమిత్తం వచి్చనవారు తిరిగి సొంత జిల్లాలు, గ్రామాలకు వెళ్లిపోయారు.ఈ ప్రభావం కూడా మరో వారం రోజుల్లో బయటకు వచ్చే ప్రమాదం ఉందని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. 

18 మందికి పాజిటివ్‌ 
ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్‌లో పాల్గొన్న వారిలో బుధవారం 18 మందికి కరోనా సోకినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు.    

పార్టీలు నేతలు, పోలీసులకు సైతం.. 
గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఓ ఎమ్మెల్యే, ఓ ఎంపీ కుమారుడు, నలుగురు కార్పొరేటర్లు, వారి కుటుంబికులు, అధికారులకు కరోనా వచి్చనట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఎన్నికల విధులు నిర్వర్తించిన ముగ్గురు పోలీస్‌ అధికారులకు, ఎస్‌ఆర్‌నగర్‌ పీఎస్‌ పరిధిలో ఆరుగురు సిబ్బందికి రెండోసారి కరోనా వచి్చనట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో పోలింగ్, కౌంటింగ్‌ లో పాల్గొన్న మిగతా ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement