
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ దారుణంగా ఉంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు కేవలం 25 శాతం మాత్రమే పోలింగ్ నమోదయ్యింది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అత్యల్ప ఓటింగ్ నమోదవుతోంది. ఐటీ ఉద్యోగులు ఉన్న ప్రాంతాల్లో కంటే నగర శివారుల్లో పోలింగ్ కాస్త మెరుగ్గా ఉంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు భారీఎత్తున ప్రచారం చేసినా నగర ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గరకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు.
(చదవండి : గ్రేటర్ పోరు: నగరవాసికి ఎందుకింత బద్ధకం?!)
పోలింగ్‌కు మరో గంటన్నర సమయం మాత్రమే ఉన్నా.. ఓటర్లు బయటకు రావడంలో లేదు. చాలా చోట్ల పోలీంగ్ బూత్‌లు ఖాళీగా కనిపిస్తున్నాయి. చాలా చోట్ల పోలింగ్ సిబ్బంది, పోలీసులు తప్ప ఓటర్లు కనిపించడం లేదు. మధ్యాహ్నం దాటిన ఓటర్లు రాకపోవడంతో ఓ పోలింగ్ కేంద్రంలో సిబ్బంది నిద్రపోయారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్‌గా మారాయి.
(చదవండి : గ్రేటర్ ఫైట్: లంగర్‌హౌస్‌లో అత్యల్పంగా 6.77 శాతం పోలింగ్)
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రతిసారి తక్కువ ఓటింగ్ శాతం నమోదువుతుంది. 2016లో 45.25 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. గతంతో పోలిస్తే ఈసారి తక్కువ పోలింగ్ నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారాన్ని ఊదరగొట్టిన నాయకులు.. ఓటర్లను బూత్‌కి రప్పించడంలో విఫలమయ్యారనే చెప్పొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment