సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్‌కు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ బుధవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. 'తాజాగా జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల స్థితిగతులపై ప్రధాని వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాదాపు 10 నిమిషాలపాటు, ఎన్నికల సరళిపై పార్టీ పరిస్థితులపై ప్రధాని ముచ్చటించారు. నాయకులు, కార్యకర్తలపైన జరిగిన దౌర్జన్యంపై ప్రధాని వివరాలు అడిగి తెలుసుకున్నారు. చదవండి: (అదే తీరు.. అత్తెసరు)
ఈ సందర్భంగా కార్యకర్తలు అద్భుతంగా పోరాటం చేశారని ప్రధాని మోదీ అభినందించారు. పార్టీని విజయతీరాలకు చేర్చడానికి అన్ని విధాలా పోరాడిన తెలంగాణ శాఖ కార్యకర్తల పోరాట పటిమను మోదీ కొనియాడారు. నూతన ఉత్సాహంతో పార్టీ క్యాడర్ నడవడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. దైర్యంగా ముందుకు సాగాలని అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలి' అని ప్రధాని మోదీ సూచించినట్లు తెలంగాణ బీజేపీ ఆ ప్రకటనలో తెలిపింది. చదవండి: (విదేశాల్లో భారతీయులకు పోస్టల్ బ్యాలెట్)
Comments
Please login to add a commentAdd a comment