జీహెచ్‌ఎంసీ ఎన్నికలు: సైకిల్‌ పంక్చర్‌!! | GHMC Elections 2020 TDP Won In 0 Divisions | Sakshi
Sakshi News home page

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు: సైకిల్‌ పంక్చర్‌!!

Published Fri, Dec 4 2020 7:20 PM | Last Updated on Fri, Dec 4 2020 9:03 PM

GHMC Elections 2020 TDP Won In 0 Divisions - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. 150 స్థానాలకు గానూ ఈ సారి 106 డివిజన్లలో పోటీ చేయగా ఒక్కటి కూడా గెలవలేదు. ఏ డివిజన్‌లోనూ డిపాజిట్‌ కూడా దక్కించుకోలేకపోయింది. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో భాగంగా 82 స్థానాల్లో పోటీ చేసి కేవలం ఒక వార్డు మాత్రమే గెలుచుకుంది. ఈ సారి ఆ ఒక్క వార్డు కూడా గెలుచుకోలేకపోవటం గమనార్హం. ( గ్రేటర్‌ ఫలితాలు : గెలిచిన అభ్యర్థులు వీరే..)

కాగా, గతంలో టీడీపీతో పొత్తులో భాగంగా 68 స్థానాల్లో బరిలోకి దిగిన బీజేపీ 4 స్థానాలు గెలిచింది. ఈ సారి 150 స్థానాల్లో పోటీ చేసి 49 డివిజన్లను కైవసం చేసుకుంది. ఇక టీఆర్‌ఎస్‌ 56, ఎమ్‌ఐఎమ్ 43‌ స్థానాలు సొంతం చేసుకున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement