ఎన్నిక లాంఛనమే! | Formal election! | Sakshi
Sakshi News home page

ఎన్నిక లాంఛనమే!

Published Thu, Feb 11 2016 12:13 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

Formal election!

 సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్‌ల ఎన్నికలను లాంఛనప్రాయంగానే రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. వివిధ పార్టీలకు ఉన్న కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యుల సంఖ్య దృష్ట్యా టీఆర్‌ఎస్ అభ్యర్థులే మేయర్, డిప్యూటీ మేయర్‌లుగా ఎన్నికవుతారని అం చనా వేశాయి.

దీంతో అసలు పోటీయే లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. టీఆర్‌ఎస్ తప్ప మిగతా పార్టీలేవీ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారికి విప్‌కు సంబంధించిన సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. మేయ ర్, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకునేందుకు కార్పొరేటర్లతో పాటు ఎక్స్‌అఫీషియో సభ్యులు అర్హులు. ప్రస్తుతం పార్టీల బలాబలాలను బట్టి టీఆర్‌ఎస్ సభ్యు లు.. దానికి మద్దతిచ్చే సభ్యులను పరిగణనలోకి తీసుకుంటే ఎన్నికలు లాంఛనమే అం టున్నారు.

మొన్నటి వరకు టీఆర్‌ఎస్‌కు 133 మంది, ఎంఐఎంకు 54, కాం గ్రెస్‌కు 10, టీడీపీకి 9, బీజేపీకి 11 మంది సభ్యుల (ఓటర్ల) బలం ఉంది. అప్పటికే టీఆర్‌ఎస్‌కు కావాల్సినంత బలం ఉంది. ఎక్స్‌అఫీషియోలుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలలో ఇద్దరు టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో సంఖ్య పెరిగింది. ప్రస్తుత బలాబలాలు...
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement