సాక్షి, హైదరాబాద్: తనకు తెలియకుండానే పనులు జరుగుతుండటంపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని ఇంజినీరింగ్ పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు తనకు తెలియకుండానే, తనకు ఆహ్వానం లేకుండానే జరగడంతో ప్రొటోకాల్ పాటించడం లేరని అసహనానికి గురైన మేయర్ విషయాన్ని కమిషనర్, ఇంజినీరింగ్ ఉన్నతాధికారులకు తెలియజేశారు.
వివరణ కోరుతూ కమిషనర్ లోకేశ్‌కుమార్ సదరు పనులు జరిగిన నాలుగు జోన్లకు చెందిన డీఈఈలు, ఈఈలతో పాటు ఎస్‌ఈలకు కూడా మెమోలు జారీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంబంధిత అధికారులు ఇప్పటికే తమ వివరణలు కూడా పంపినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment