‘‘వ్యవసాయానికి ఉచిత విద్యుత్ రైతన్నకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన ఓ వరం. మండుటెండల్లో పాదయాత్ర చేసి రైతుల కష్టాలు కడగళ్లు చూసిన వైఎస్.. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన తొలి సంతకం ఉచిత విద్యుత్ ఫైల్‌పైనే పెట్టారు’’కోతల బాబుకు పట్టని కరెంటు కోతలుచెప్పింది 9 గంటలు.. ఇచ్చింది 4 గంటలు
సాక్షి, అమరావతి: 2014 మేనిఫెస్టోలో రోజుకు 9 గంటల వ్యవసాయ ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించిన టీడీపీ.. నాలుగున్నరేళ్లు ఆ ఊసే ఎత్తలేదు. ఎన్నికలు సరిగ్గా మరో ఆర్నెల్లు ఉన్నాయనగా.. కేవలం నాలుగు నెలల కోసం హడావుడిగా రోజుకు 9 గంటల విద్యుత్ ఇస్తామని ప్రకటించింది చంద్రబాబు సర్కారు. దీన్ని అదే పనిగా ప్రచారం చేసుకుంటున్నారు. ఈ ప్రచారం మాటెలా ఉన్నా.. అసలు వాస్తవాలు పరిశీలిస్తే చంద్రబాబు సర్కారు మాయాజాలం ప్రతీ ఒక్కరికీ ఇట్టే అర్థమవుతుంది.
నాలుగు గంటలకే దిక్కులేదు
తొమ్మిది గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన టీడీపీ.. ఐదేళ్లుగా రైతుకు కనీసం 7 గంటలైనా వ్యవసాయానికి కరెంట్ ఇవ్వలేదనేది వాస్తవం. రాష్ట్రంలో 17 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్నాయి. అన్ని పంపుసెట్లకు 5 అశ్వశక్తి సామర్థ్యం (హెచ్‌పి) మోటర్లనే బిగించారు. ఒక పంపుసెట్ గంట నడిస్తే 5 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. ప్రభుత్వం ఏడు గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెబుతోంది. అంటే.. రోజుకు ఒక్కో పంపుసెట్‌కు 35 యూనిట్లు విద్యుత్ ఖర్చవుతుంది. ఈ లెక్కన 17 లక్షల పంపుసెట్లకు రోజుకు 59 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం. కానీ ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న ఉచిత విద్యుత్ రోజుకు కేవలం 29.67 మిలియన్ యూనిట్లే. అంటే.. ఒక్కో పంపుసెట్‌కు గంటకు 5 యూనిట్ల చొప్పున లెక్కేస్తే కేవలం మూడున్నర గంటల పాటు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదు. కానీ రోజుకు ఏడు గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్టు నాలుగున్నరేళ్లుగా ప్రచారం చేసుకుంటోంది.
9గంటలకేటాయింపేది
రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు రోజుకు 9 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలంటే.. ఒక్కో పంపుసెట్‌కు రోజుకు 45 యూనిట్ల విద్యుత్ అవసరం. అంటే 17 లక్షల పంపుసెట్లకు రోజుకు 76 మిలియన్ యూనిట్లు ఇవ్వాలి. ఈ లెక్కన ఏడాదికి 27,922.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా అవసరం. కానీ ప్రభుత్వం ప్రస్తుతం ఏటా ఇస్తున్న 10,831.44 మిలియన్ యూనిట్లతోపాటు మరో 1200 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే అదనంగా ఇస్తానంటోంది. మొత్తం కలిపినా ఉచిత విద్యుత్‌కు ఇచ్చేది 12031.44 మిలియన్ యూనిట్లు మాత్రమే. పెంచిన ఈ విద్యుత్‌ను కలుపుకున్నా నిండా రోజుకు నాలుగు గంటల పాటు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వలేని పరిస్థితి. వాస్తవ విద్యుత్ వినియోగం, ప్రభుత్వం ఇస్తామనే విద్యుత్ సరఫరాకు మధ్య 15891.06 మిలియన్ యూనిట్ల తేడా ఉంది. ఇంత తేడా పెట్టుకుని రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉందని విద్యుత్ వర్గాలే అంటున్నాయి. వ్యవసాయ విద్యుత్‌కు ఇవ్వాల్సిన సబ్సిడీ రూ.13 వేల కోట్లకు గాను రూ.5 వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. రోజుకు మూడు, నాలుగు గంటలే విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. ఐదేళ్లుగా ఉచిత విద్యుత్ సరఫరాలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.
ఐదేళ్లుగా వైఫల్యమే!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్ పథకం అమలులోకి తెచ్చిన తర్వాత విద్యుత్ కనెక్షన్ల దరఖాస్తులు భారీగా పెరిగాయి. వైఎస్ హయాంలో అడిగిన ప్రతీ రైతుకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. రాష్ట్ర విభజన నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 15.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లున్నాయి. ప్రస్తుతం వీటి సంఖ్య 17 లక్షలకు చేరింది. ఏటా 1.5 లక్షల కొత్త కనెక్షన్ల కోసం దరఖాస్తులొచ్చాయి. కానీ టీడీపీ ప్రభుత్వం మాత్రం సంవత్సరానిక 30 వేలకు మించి అనుమతించలేదు. ఉన్న కనెక్షన్లను జియో టాగింగ్‌లోకి తెచ్చింది. రైతు పేరు మీద భూమి ఉంటేనే కనెక్షన్ ఉండాలని.. ఆదాయ పరిమితికి లోబడి ఉండాలని.. 2.5 ఎకరాల సాగుబడే ఉండాలంటూ షరతులు పెట్టింది. 3 లక్షల కనెక్షన్లను తొలగించాలని భావించింది. రైతుల తిరుగుబాటు, ఎన్నికలు రావడంతో ఈ ప్రతిపాదిన ప్రస్తుతానికి పెండింగ్‌లో పెట్టారు.
ఇదీవాస్తవచిత్రం
♦ రాష్ట్రంలో వ్యవసాయకనెక్షన్ల సంఖ్య17 లక్షలు
♦ ఏడు గంటల విద్యుత్ ఇస్తే అవసరమయ్యే విద్యుత్ 59 మిలియన్ యూనిట్లు (రోజుకు)
♦ ఇచ్చే ఈ విద్యుత్ ఎన్ని గంటలకు సరిపోతుంది 3.5 గంటల లోపు (రోజు)
♦ 9 గంటల విద్యుత్ ఇవ్వాలంటే కావాల్సిన విద్యుత్ 76 మిలియన్ యూనిట్లు (రోజుకు)
♦ ప్రభుత్వం ఇప్పుడిస్తోంది 29.67 మిలియన్ యూనిట్లు(రోజుకు)
♦ ఇప్పుడు ఇవ్వాలనుకునే విద్యుత్ (9 గంటలకు) 32.96 మిలియన్ యూనిట్లు (రోజుకు)
♦ ఇది ఎన్నిగంటలకు సరిపోతుంది? 4 గంటలు (రోజుకు)
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే వ్యవసాయానికి 9 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను రైతులకు ఉచితంగా ఇస్తాం– 2014 ఎన్నికలప్పుడు చంద్రబాబు రైతులకు ఇచ్చిన హామీ! రాష్ట్రంలోని రైతులకు ఎలాంటి ఆటంకం లేకుండా.. వ్యవసాయానికి 9గంటల ఉచిత కరెంట్ ఇస్తామని నమ్మబలికితే నిజమే అనుకున్నారు రైతులంతా..! వాస్తవానికి గత ఐదేళ్లుగా ఏనాడూ నిండా నాలుగు గంటలకు మించి రైతులకు కరెంట్ ఇవ్వలేదన్నది నూటికి నూరుపాళ్లు నిజం.
Comments
Please login to add a commentAdd a comment