సాక్షి కథనంపై సీఎం కేసీఆర్ స్పందన | kcr-response-on-sakshi-story | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 15 2014 5:35 PM | Last Updated on Wed, Mar 20 2024 1:58 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫైళ్ల పెండింగ్ అంశానికి సంబంధించి సాక్షి కథనంపై సీఎం కే చంద్రశేఖర రావు స్పందించారు. ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించడం కోసం సీఎం కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులకు శాఖలను కేటాయించారు. ప్రిన్సిపల్‌ సెక్రటరీ నర్సింగరావుకు సాధారణపరిపాలన, హోం, ఫైనాన్స్‌.. స్పెషల్‌ సెక్రటరీ రాజశేఖరరెడ్డికి ఆరోగ్యం, విద్య, రవాణా, సీఎం రిలీఫ్‌ఫండ్‌, న్యాయశాఖ.. స్మితా సభర్వాల్‌కు హరితహారం, అటవీశాఖ, స్త్రీ శిశు సంక్షేమం, గృహనిర్మాణశాఖ.. భూపాల్‌రెడ్డికి అన్ని సంక్షేమశాఖలు, దేవాదాయశాఖ, పౌరసరఫరాలు, కార్మికశాఖ కేటాయించారు. సాక్షి దినపత్రికలో 'కదలని ఫైలు!' అనే శీర్షికతో సోమవారం వార్త ప్రచురితమైంది. తెలంగాణ సీఎం వద్ద ఫైళ్లు భారీగా పేరుకుపోయాయని, దాదాపు వెయ్యి వరకు ఉన్నాయని వార్తలో వెల్లడించారు. ఈ కథనానికి కేసీఆర్ స్పందించి ఫైళ్ల పరిష్కార బాధ్యతలను అధికారులకు అప్పగించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement