తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అంశానికి సంబంధించి సరికొత్త వివాదాన్ని తెరలేపారు నారా లోకేష్. అసలు తెలంగాణను ఎవరు అభివృద్ధి చేసారన్న అంశంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు లోకేష్ సవాల్ విసిరారు. ఈ అంశంపై టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బహిరంగంగా చర్చించే ధైర్యం కేసీఆర్ కు ఉందా? అంటూ సవాల్ విసిరారు. గురువారం ట్విట్టర్ లో హైదరాబాద్ ఇమేజ్ విధ్వంసం అనే అంశంపై చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారా? అంటూ ఛాలెంజ్ చేశారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఎందుకు ఏర్పడిందో తెలపాలంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు.