![TS CM Selection: Congress High Command Call For Revanth Reddy - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/5/Revanthreddy.jpg.webp?itok=YXikNMnB)
సాక్షి, హైదరాబాద్/ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో జరుగుతున్న హస్తిన చర్చలు మరింత హీటెక్కిస్తున్నాయి. అధిష్టానం పిలుపుతో మంగళవారం సాయంత్రం హుటాహుటిన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఢిల్లీ బయల్దేరారు. కాసేపట్లో ఏఐసీసీ కార్యాలయంలో కేసీ వేణుగోపాల్ మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.
సోమవారం హైదరాబాద్‌లో సీఎల్పీ జరిగిన సీఎల్పీ భేటీలో సీఎల్పీ నేత ఎవరనే దానిపై కసరత్తులు జరగ్గా.. మంగళవారం ఢిల్లీ వేదికగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏఐసీసీ పెద్దలతో తెలంగాణ ఎన్నికల పరిశీలకుడు డీకే శివకుమార్ ఇవాళంతా చర్చలు జరిపారు. ఆపై సాయంత్రం ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ ఇంట్లో కీలక భేటీ జరిగింది. డీకేఎస్, తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రేలతో పాటు తెలంగాణ సీనియర్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఆ వెంటనే హైదరాబాద్‌లో ఎమ్మెల్యేలు ఉన్న ఎల్లా హోటల్ నుంచి రేవంత్ ఢిల్లీకి బయల్దేరడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
.
Comments
Please login to add a commentAdd a comment