తెలంగాణ సర్కార్ జారీ చేసిన జీవోలో రుణమాపీ చెల్లింపు ఊసే లేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఆరోపించారు. రుణమాఫీకి అర్హులెవరో తెల్చండంటూ నిబంధనలు జారీ చేశారని ఆయన గుర్తు చేశారు. గురువారం హైదరాబాద్లో షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ... రుణాలు చెల్లించాలని బ్యాంకులు రైతులకు నోటీసులు ఇస్తున్నాయని అయన చెప్పారు. రుణమాఫీ అవుతుందో లేదో అనే అందోళనతో రాష్ట్రంలోని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ నిర్మిస్తారనుకుంటే... ఆత్మహత్యల తెలంగాణగా మారుస్తున్నారని షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రైతులను మోసగించడం మానుకోవాలని ఈ సందర్బంగా షబ్బీర్ అలీ... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు హితవు పలికారు. తెలంగాణ విద్యార్థులకు ప్రత్యేక ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్ని మీడియాలో ఉదరగొట్టిన విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఇప్పుడు ఆచూకీ లేకాండా పోయాడని అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని షబ్బీర్ అలీ ఆరోపించారు.
Published Thu, Aug 14 2014 5:35 PM | Last Updated on Fri, Mar 22 2024 11:31 AM
Advertisement
Advertisement
Advertisement