మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్ అలీ అన్నారు. ఒక్క ఏడాదిలో కేసీఆర్ 63 వేల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చిన్నపరిశ్రమలకు ఇస్తానన్న 12వందల కోట్ల రాయితీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.