భారీ వర్షాలకు నగరం అతలాకుతలం అవుతుంటే.. అసెంబ్లీ సీట్లు పెంచుకోవడానికి ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లడం విడ్డూరమని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. నగరంలోని నిజాంపేట బండారి లేఅవుట్ వాసులు నాలుగు రోజుల నుంచి విద్యుత్ సరఫరా లేకుండా అంధకారంలో ఉంటే పట్టించుకునే నాధులే కరువయ్యారన్నారు. కనీస అవసరాలైన పాలు, మందులు, మంచినీళ్లు లేక.. పాముల బెడదతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా జీహెచ్‌ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.