
రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్
* 7న రాష్ర్టపతి, ప్రధానమంత్రితో భేటీ
* పోలవరంపై ప్రధానికి వినతి పత్రం
* డిమాండ్ల చిట్టా సిద్ధం చేయాలని అన్ని శాఖల కార్యదర్శులకు సీఎస్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత కేసీఆర్ శుక్రవారం తొలిసారిగా ఢిల్లీ వెళుతున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయున కేంద్రం వుుందు పలు డివూండ్ల చిట్టా ఉంచనున్నారు. ఇందుకోసం నివేదికలు తయూరుచేయూలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అన్ని శాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేశారు. బుధవారం సచివాలయుంలోని ‘సీ’ బ్లాక్‌లో అన్ని శాఖల కార్యదర్శులతో సవూవేశం నిర్వహించారు. ఈ నెల 7న సీఎం కేసీఆర్ రాష్ట్రపతి ప్రణబ్‌వుుఖర్జీ, ప్రధాని మోడీని కలవనున్నారు. పోల వరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేస్తూ తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను వెనక్కు తీసుకోవాలని కోరుతూ ప్రధానికి వినతిపత్రం అందజేయునున్నారు.
పోలవరం ప్రాజెక్టు డిజైన్ వూర్చాలని టీఆర్‌ఎస్ డివూండ్ చేస్తున్న విషయుం విదితమే. రాష్ట్ర పునర్వ్వవస్థీకరణ చట్టంలో పేర్కొన్న మేరకు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను ఏకరువు పెట్టనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించని కారణంగా కేంద్రం నుంచి నిలిచిపోరుున వుున్సిపల్, పంచాయుతీరాజ్ శాఖల నిధులు, జేఎన్‌ఎన్‌యుూఆర్‌ఎం ట్రాన్సిషన్ పీరియడ్‌లో రావాల్సిన నిధుల గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావించనున్నారు. ఎస్సీ, ఎస్టీ పథకాల కింద నిధులు, రహదారులు, ఇతర ప్రభుత్వ గ్రాంట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులకు సూచించినట్లు సమాచారం. అలాగే విద్యుత్ ప్రాజెక్టులకు బొగ్గు లేదా గ్యాస్ సరఫరాకు సంబంధించి కేసీఆర్ ప్రధానితో చర్చించనున్నట్లు తెలిసింది.