తాడేపల్లి: చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్షించారు. చంద్రబాబు పరామర్శకు వచ్చి రాజకీయాలు మాట్లాడారని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. పాత లెక్కలు తేల్చుకోవడానికి వచ్చారా? పరామర్శించడానికి వచ్చారా? అంటూ ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. కరోనాను ఎదుర్కోవడంలో ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రప్రభుత్వమే ప్రశంసించిందని మంత్రి పేర్ని నాని గుర్తు చేశారు. 20 నెలల్లోనే 97శాతం హామీలను సీఎం జగన్ నెరవేర్చారని అన్నారు.
మాట ఇచ్చి తప్పడం చంద్రబాబు నైజం!
మాట ఇచ్చి తప్పడం చంద్రబాబు నైజమని మంత్రి పేర్ని నాని దుయ్యబట్టారు. చంద్రబాబు ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నీళ్లిస్తే ప్రజలు ఎందుకు ఓడించారో? చెప్పాలన్నారు. చంద్రబాబు గిరిజనులకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. బెల్ట్ షాపులకు ప్రాణం పోసింది చంద్రబాబు కాదా? అని అడిగారు. దొంగలకు, వెన్నుపోటుదారులకు చంద్రబాబు ఆదర్శం అని దుయ్యబట్టారు. తెలంగాణ జల అక్రమాలపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు? అని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment